‘ఫ్యాన్సీ’ హవా
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్ పెరిగింది. వాహనదారులు లక్షలాది రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు.
- నంబర్ల కోసం వాహనదారుల ఆరాటం
- మార్కెట్లో గుర్తింపు కోసం ప్రయత్నం
- లక్షలు వెచ్చించేందుకు వెనుకాడని జనం
- 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.4.90 లక్షల వేలం
- ఏడాదిలో రూ.70 లక్షల అదనపు ఆదాయం
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్ పెరిగింది. వాహనదారులు లక్షలాది రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరు తున్నది. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నది. మార్కెట్లో మంచి గుర్తింపు ఉండేందుకు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నంబర్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో ఏడాదిలో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.70,92,383 అదనపు ఆదాయం సమకూరింది.
అదనపు ఆదాయం..
వాహనదారులకు ఇష్టమైన నంబర్‌తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో ద్విచక్ర, ఫోర్ వీలర్ల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. టూవీలర్‌కు రూ.2000, ఫోర్‌వీలర్‌కు రూ.10,000లతో తమకు ఇష్టమైన నంబర్లను రిజర్వ్ చేసుకుని నంబర్లను సొంతం చేసుకుంటున్నారు.
ఫ్యాన్సీ నంబర్ల వారీగా రేట్లు
రవాణ శాఖ సూచించిన విధంగా ఆయా రవాణ శాఖ కార్యాలయాల్లో ఒక్కో ఫ్యాన్సీ నంబర్లకు ఒక విధమైన రేట్‌ను విధించారు. రూ.50వేలకు 000కు ,0001, 0009, 999, 9999 రూ.30 వేలకు 99, 333, 555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888,రూ.20 వేలకు 123, 222, 369, 444, 567, 786, 1111, 1116, 3366, 3456, 4455, రూ10వేలకు 3, 5, 6, 7, 111, 234, 306,405,789,818, 909, 1188, 1234, 1314, 1818,
1899, 2277, 2772, 2345, 2727, 2799, 3636, 3663, 3699, 4545, 4554, 4567, 4599, 5678, 6336, 6633, 6789,7227,7722,8118,8811,9009, 9099 ఇలా నంబర్ల వారీగా రేటు నిర్ణయించారు. ఒక నంబర్‌ను ఒకరికంటే ఎక్కువ మంది రిజర్వ్ చేసుకుంటే వేలం ద్వారా ఎవరూ ఎక్కువ మొత్తంలో పాడుతారో వారికే ఆ నంబర్‌ను కేటాయిస్తారు.
ఏడాదిలో 70 లక్షల అదనపు ఆదాయం..
నిర్మల్ జిల్లాలో 2022 డిసెంబర్ వరకు మొత్తం 983 మంది వాహన దారులు తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రవాణాశాఖకు మొత్తం రూ.70,92,383ల ఆదాయం సమకూరింది. ఇందులో రిజర్వేషన్ ద్వారా రూ.44, 93,000, వేలం ద్వారారూ.25,99,383 అదనపు ఆదాయం సమకూరింది. ఇందులో 9999 ఫ్యాన్సీ నంబర్‌ను రూ.4,90, 000లు చెల్లించి వేలం ద్వారా సొంతం చేసుకున్నారు.
రిజర్వేషన్ చేసుకుంటేనే అవకాశం
వాహనదారులు తమకు ఇష్టం వచ్చిన ఫ్యాన్సీ నంబర్లను తీసుకోవచ్చు. ముందు గా సూచించిన నంబర్లకు సంబంధించిన అమౌంట్ చెల్లించి రిజర్వేషన్ చేసుకోవాలి. ఒకరి కంటే ఎక్కువ మంది రిజర్వేషన్ చేసుకుంటే వేలం ద్వారా ఎంపిక చేస్తాం. ఎవరైతే వేలంలో ఎక్కువ పాడుతారో వారికే ఆ నంబర్‌ను కేటాయిస్తాం.
– ఏ అజయ్ కుమార్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

