శుక్రవారం 07 ఆగస్టు 2020
Adilabad - Jul 05, 2020 , 22:53:45

పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత

పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత

ఆదిలాబాద్‌ రూరల్‌: పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంపూర్‌రోడ్‌లో లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణంతో పాటు, పచ్చదనాన్ని అందించాలనే ఉద్దేశంతో హరితహారాన్ని ప్రారంభించారన్నారు. మొ క్కల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీపీలు, మున్సిపాలిటీల్లో చట్టాలు సైతం రూపొందించిందని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రం జాని, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అక్బ ర్‌, ప్రధానకార్యదర్శి విజయ్‌ పాల్గొన్నారు.


logo