పందిరి సాగు.. లాభాలు బాగు..

అర ఎకరంలో బీర, కాకర సాగు
మరో అర ఎకరంలో టమాట, బెండ..
రోజుకు రూ.3వేల పైగా ఆదాయం
ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మణచాంద రైతు
లక్ష్మణచాంద, సెప్టెంబర్ 16 : మండల కేంద్రానికి చెందిన రైతు షేక్ షాదుల్లా కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్నాడు. తీరొక్క పంట పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందిపుచ్చుకొని కూరగాయల సాగులో ముందుకుసాగుతున్నాడు. మండలకేంద్రం లక్ష్మణచాందకు చెందిన షేక్ షాదుల్లాకు రెండెకరాల భూమి ఉంది. ఇందులో ఎకరం భూమిలో కూరగాయలు సాగుచేస్తున్నాడు. ముఖ్యంగా అర ఎకరంలో పందిరిసాగుకు శ్రీకారం చుట్టాడు. ఉపాధిహామీ పథకం ద్వారా పందిరిసాగుకు అవసరమైన పోల్స్, తదితరవి సమకూర్చుకున్నాడు. తీగజాతి రకాలైన బీర, కాకర సాగు చేపట్టాడు. దీనికి తోడు మరో అర ఎకరంలో ఒక వైపు బెండ, మరోవైపు టమాట సాగు చేస్తున్నాడు. కూరగాయల సాగు ద్వారా అన్ని ఖర్చులు పోనూ రోజుకు రూ.3 వేలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడు.
ఉపాధి హామీ ద్వారా పందిరి ఏర్పాటు..
కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ ద్వారా రైతులకు చేయూతనందిస్తున్నది. అర ఎకరం భూమిలో పందిరి సాగుకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నది. రైతు షాదుల్లా కూరగాయల సాగు చేపట్టడానికి ఉపాధిహామీ పథకం కింద పందిరి వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో రూ.లక్ష మంజూరయ్యాయి. ఈ డబ్బుతో పందిరి నిర్మించుకున్నాడు. బీర, కాకర వంటి తీగజాతి రకాలను సాగు చేస్తున్నాడు.
గతం కంటే మంచి ఆదాయం..
గతంలో నేను కూరగాయల సాగు చేపట్టాను. అంత మంచి దిగుబడి వచ్చేదికాదు. మొక్కలు తొందరగా పాడయ్యేవి. పందిరి సాగుతో మొక్కలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. నాణ్యమైన కూరగాయలు వస్తున్నాయి. రెండు నెలలుగా బీర, కాకర కాయల దిగుబడి అధికంగా వస్తున్నది. టమాట, బెండకా యలు సైతం ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. వీటి ద్వారా మరింత ఆదాయం పెరుగుతున్నది. ప్రభుత్వం అందించిన సహాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటా.
- షేక్ షాదుల్లా, రైతు, లక్ష్మణచాంద
రోజుకు మూడు వేల ఆదాయం..
అర ఎకరం భూమిలో కాకర, బీర సాగు చేయడం ద్వారా మేలైన కూరగా యల దిగుబడి వస్తున్నది. పందిరి ద్వారా కాయల పెరుగుదల వేగంగా ఉంటు న్నది. పొడవుగా పెరిగిన బీర, కాకర కాయలను కొనడానికి ప్రజలు ఇష్టపడుతు న్నారు. బీర కాయలు రోజుకు నాలుగు ట్రేలు, కాకర రోజుకు రెండు ట్రేల చొప్పున దిగుబడి వస్తున్నది. కూరగాయల ప్రస్తుత ధర డబ్బాకు రూ.600పైగా ఉంది. దీనికితోడు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిరోజూ ఎక్కడో చోట వారసం తలు జరుగుతున్నాయి. అక్కడకు వెళ్లి స్వయంగా తనే కూరగాయలు అమ్ముతున్నాడు. ఇలా ఆదాయం రాగా, ఖర్చులు పోనూ రోజుకు రూ.3వేలకు పైనే సంపాదిస్తున్నాడు. ఇప్పటికే రెండు నెలలుగా బీర, కాకర కాయలు అమ్మగా.. ప్రస్తుతం బెండ, టమాటా కూడా చేతికి రావడంతో ఆదాయం మరింత పెరుగుతున్నది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

