mehreen | బ్రేకప్ తర్వాత రెచ్చిపోతున్న మెహ్రీన్.. సీక్రేట్ ఏంటబ్బా..?

mehreen kaur firzada | ఒక రిలేషన్ నుంచి బ్రేకప్ అయితే ఎవరైనా బాధ పడతారు. కానీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య తన నిశ్చితార్థం బ్రేక్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్లే. కానీ పూర్తి పెళ్లినే కాదనుకుని విడిపోయే జంటలు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి సగం పెళ్లికి విలువేం ఉంటుంది చెప్పండి. అభిప్రాయాలు కలవకపోతే పీటల వరకు వచ్చిన పెళ్లినే కాదంటున్నారు. మెహ్రీన్ కూడా ఇదే చేసింది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికే కోడలిగా వెళ్లాల్సిన ఈమె.. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లినే కాదని అనుకుంది.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుటుంబంలోకి మెహ్రీన్ కౌర్ కోడలిగా వెళ్లడం దాదాపు ఖరారైంది. భజన్ లాల్ మనవడు భవ్య బిష్నోయ్తో ప్రేమలో పడి ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే చివరి నిమిషంలో ఈ ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. తమ బంధం విడిపోయిందని జులై 3న సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దానికి తమ వ్యక్తిగత కారణాలు తమకు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత చాలా నిశ్చింతగా కనిపిస్తుంది మెహ్రీన్. బ్రేకప్ తర్వాత మరింత జాలీగా మారిపోయింది మెహ్రీన్. భవ్యతో విడిపోయిన తర్వాత అందాల ఆరబోతలో కూడా డోస్ పెంచింది మెహ్రీన్.

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ తర్వాత మెహ్రీన్ ఛిల్ అవుతుంది. గతం గురించి ఆలోచించకుండా హాయిగా హాట్ ఫోటో షూట్లతో వేడి పెంచేస్తుంది మెహ్రీన్. తన కొత్త ఫోటోలను ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుని తానెంతో సంతోషంగా ఉందో చెప్పకనే చెప్పింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయినందుకు ఏ మాత్రం బాధ లేదని ఈ ఫోటోలతోనే అర్థమైపోతుంది. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్-3లో నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది.


































లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మెహ్రీన్ కౌర్ కంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
Mehreen Kaur : కలర్ ఫుల్ శారీలో కేక పెట్టిస్తున్న మెహ్రీన్
Read Today's Latest Actress News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

