కేశాలు.. కష్టాలు
ఆధునిక జీవితాలను ఇబ్బందిపెడుతున్న వాటిలో జుట్టు సమస్య ఒకటి. పునరపి జననం, పునరపి మరణం.. అన్నమాట వెంట్రుకలకూ వర్తిస్తుంది. మన మాడు మీద 90% వెంట్రుకలు పెరిగే దశలో ఉంటాయి.
ఆధునిక జీవితాలను ఇబ్బందిపెడుతున్న వాటిలో జుట్టు సమస్య ఒకటి. పునరపి జననం, పునరపి మరణం.. అన్నమాట వెంట్రుకలకూ వర్తిస్తుంది. మన మాడు మీద 90% వెంట్రుకలు పెరిగే దశలో ఉంటాయి. 10% మాత్రం రాలిపోయే స్థితిలో ఉంటాయి. ఆ పెరుగుదలను మరింత పెంచి, రాలిపోవడాన్ని నియంత్రిస్తే.. కేశాల క్లేశాలు ఉండవు. ఆ ప్రయత్నంలో ఉన్నవారి కోసం అనేక చిట్కాలు సిద్ధం. గుమ్మడి గింజల నూనెను మూడు నెలలపాటు వాడితే వెంట్రుకలు మళ్లీ మొలిచే అవకాశం ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే బట్టతలకు గుమ్మడి గింజల నూనెను సిఫారసు చేస్తుంది ఆయుర్వేదం. రోజ్మేరీ తైలం, జొజొబా తైలం, లావెండర్ తైలం, పెప్పర్మింట్ తైలం, టీ ట్రీ తైలం కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. కాఫీ ఆధారిత షాంపూలు సైతం కొంతమేర సహకరిస్తాయి. ఆహారంలో మార్పు కూడా కేశాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. వాటితోపాటు అమైనో ఆమ్లాలను తగిన మొత్తంలో తీసుకోవాలి. తాజా కూరగాయలతో సమృద్ధమైన ఆహారం పురుషులలో బట్టతల ముప్పును తగ్గిస్తుంది. అదనంగా, మల్టీ విటమిన్ సప్లిమెంట్లు మరింత ప్రయోజనకరం. సెలీనియం, జింక్, ఐరన్, విటమిన్- ఎ, బి, సి, డి, ఇ కేశాల ఆరోగ్యంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.
ముఖ్యమైన పరీక్షలు
బ్లడ్ టెస్ట్: దీనిద్వారా వెంట్రుకలు రాలిపోవడానికి మూల కారణాలను గుర్తించవచ్చు.
పుల్ టెస్ట్: పరీక్షలో భాగంగా వైద్యుడు రోగి మాడు నుంచి కొన్ని వెంట్రుకలను పట్టి లాగుతాడు. దీనివల్ల కేశ సమస్య ఏ దశలో ఉందనేది అర్థం అవుతుంది.
స్కాల్ప్ బయాప్సీ: ఇందులో భాగంగా జుట్టు కుదుళ్లను మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. జుట్టు రాలిపోవడానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కారణమా అన్నదీ పరిశీలిస్తారు.
లైట్ మైక్రోస్కోపీ: ఈ పరీక్షలో ఓ ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగించి కుదుళ్లను పరిశీలిస్తారు.
తిరిగి వస్తుందా?
సాధారణంగా స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ బట్టతల జన్యుపరమైన, హోర్మోన్లపరమైన కారణాల వల్ల తలెత్తుతుంది. ఆ ఇబ్బంది ఏ వయసులోనైనా రావచ్చు. పురుషులలో 50 ఏండ్ల వయసులో, మహిళలలో మెనోపాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. సమస్యను తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే వెంట్రుకలు రాలడాన్ని అరికట్టవచ్చు. జట్టును కాపాడుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

