నేనూ తప్పులు చేశాను!

సినిమాల్లో హీరోలకు రిటైర్మెంట్ వయసు ఉండదు. కానీ, కథానాయికలు మాత్రం పెండ్లయ్యిందా.. కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాల్సిందే! వయసు ముప్పయ్ దాటిందా.. కాల్షీట్లు, కాస్ట్ తగ్గించుకోవాల్సిందే! కానీ, ఈ సూత్రీకరణ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్‌కు వర్తించదు. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏండ్లు కావొస్తున్నా ఆమెను అవకాశాలు పలుకరిస్తున్నాయి. పెండ్లయ్యాక కూడా నటనను కొనసాగిస్తున్నది. మెగాస్టార్ సరసన రెండోసారి హీరోయిన్ చాన్స్ కొట్టేసిన ఈ పంజాబీ భామ బాలీవుడ్‌పైనా కన్నేసింది. టైటిల్ రోల్లో ఓ చిత్రంలో నటించనుంది.
- సినిమాల్లోకి వచ్చి పదిహేడేండ్లు గడిచిపోయాయి. నా జర్నీ చాలా హ్యాపీగా సాగింది. ఈ ప్రయాణంలో కొన్ని తప్పులు జరిగాయి. అందుకు నేనేం ఫీలవ్వడం లేదు. ఆ తప్పులే జీవిత పాఠాలు చెప్పాయి. నన్ను మిన్నగా నిలబెట్టాయి. పొరపాట్లు అందరూ చేస్తారు. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఈ విషయంలో నేను సక్సెస్ అయ్యాననే భావిస్తున్నా.
- దాదాపు ఏడాదిన్నపాటు ప్రపంచమంతా భయానక పరిస్థితుల్లో ఉండిపోయింది. కొవిడ్, లాక్డౌన్ అన్ని రంగాలను దెబ్బతీశాయి. సినిమా ఇండస్ట్రీకి ఇది పరీక్షా కాలం. ముఖ్యంగా సెకండ్ వేవ్ ఇంత దారుణంగా దెబ్బ తీస్తుందని ఊహించలేదు. అయిన వారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు ఆవేదనలో కూరుకు పోయాయి. వారందరికీ నా సానుభూతి. ఇలాంటి సమయంలోనే దృఢంగా ఉండాలి. మరింత బలంగా తయారవ్వాలి.
- లాక్డౌన్లో షూటింగ్స్ లేకపోవడంతో కాస్త తీరిక దొరికింది. అలాగని తింటూ కూర్చోలేం కదా! ఏదో ఒక వ్యాపకం ఉంటేనే మనసుకు ఊరట. అందుకే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. మెటాఫిజిక్స్, ఆస్ట్రానమీలో వర్చువల్ క్లాస్‌లు వింటున్నా. భగవద్గీత తరగతులు కూడా ఫాలో అవుతున్నా. ఆరోగ్యకర ఆహారం తీసుకుంటున్నా. హాయిగా వర్కవుట్లు చేసుకుంటున్నా. హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా టీచర్ అవతారమెత్తి మా పని
మనిషి ఐదేండ్ల కొడుక్కి ఇంగ్లిష్ చెబుతున్నా. - బాలీవుడ్లో ‘ఉమ’ అనే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నా. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సబ్జెక్ట్ బాగా నచ్చింది. విభిన్న షేడ్స్ ఉన్న ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకున్నా. కథ, పాత్ర తీరుతెన్నుల గురించి దర్శకుడితో జూమ్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే షూటింగ్ మొదలవుతుందని ఆశిస్తున్నా.
- దక్షిణాది ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను మరచిపోలేను. దక్షిణాదిలో కమర్షియల్ సినిమాల్లో నటించాను. మంచి సబ్జెక్టివ్ సినిమాలూ చేశాను. రకరకాల పాత్రలు పోషించాను. ఇక్కడి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం
అదృష్టంగా భావిస్తున్నాను. - సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దక్షిణాది భాషలు అస్సలు అర్థమయ్యేవి కావు. ఇప్పుడు తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్నా. తమిళం కూడా! కన్నడం, మలయాళం అర్థం చేసుకుంటా. భాషలపై పట్టు సాధించడానికి నేను చాలానే కష్టపడ్డాను. షూటింగ్ స్పాట్లో దర్శకుడు, ఇతర టెక్నీషియన్స్‌తోనూ మాట్లాడేదాణ్ని. ఇప్పుడు తెలుగులో యాసలు కూడా మాట్లాడగలను. అయినా, భావోద్వేగాలను పండించడానికి భాష రావాల్సిన పన్లేదు. కథను, పాత్రను అర్థం చేసుకోగలిగితే.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగితే సన్నివేశాన్ని పండించగలం.
- ఒక పని మొదలు పెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. వాటికి బెదిరి పోవద్దు. మధ్యలో వెనుదిరిగే మనస్తత్వం కాదు నాది. ధైర్యంగా ముందుకు వెళ్లడమే తెలుసు. ఇన్నేండ్లు నేను ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం వెనుక కారణం కూడా ఇదే అనుకుంటా!
- లాక్‌డౌన్‌తో థియేటర్లు కళ తప్పిన మాట వాస్తవమే. ఈ సమయంలో ఓటీటీ వేదిక ఇంటింటికీ పరిచయమైంది. అలాగని, ఓటీటీ ఎప్పుడూ థియేటర్లకు ప్రత్యామ్నాయం కాదు. నేను నటించిన వెబ్‌సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’ ఓటీటీలో రిలీజై సక్సెస్ సాధించడం ఆనందంగా ఉంది.
- ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటా. కంఫర్ట్‌గా ఉండేవే ధరిస్తాను. జీన్స్, టీషర్ట్ వంటి మోడర్న్ డ్రెస్‌లు వెసుకుంటా. అనామికా ఖన్నా, రాహుల్ మిశ్రా వంటి డిజైనర్ల దుస్తులు ధరిస్తాను, ఫుట్
పాత్‌పై దొరికే దుస్తులూ కొంటాను. మంచి జువెలరీ కలెక్షన్ ఉంది నా దగ్గర. వజ్రాభరణాలంటే ఇష్టం. - ఆహారం విషయంలో మరీ స్ట్రిక్ట్‌గా ఏమీ ఉండను. అలాగని చిరుతిండ్లు, ఆయిలీ ఫుడ్ తినను. హెల్దీడైట్ ఫాలో అవుతాను. బ్రేక్ ఫాస్ట్‌లోకి జొన్నరొట్టె తీసుకుంటా. కాసేపయ్యాక పండ్లు తింటాను. లంచ్ టైమ్‌లో అన్నం, పప్పు, కూరలు ఆరగిస్తాను. సాయంత్రం సాండ్విచ్, రాత్రి డిన్నర్‌లోకి అన్నం తింటాను. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్ సరైన మోతాదులో ఉండేలా డైట్ పాటిస్తాను. ఏం తిన్నా మితంగానే.

లాక్‌డౌన్‌కు ముందు రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తుండేదాన్ని. వెయిట్ ఎక్సర్సైజ్లు చేసేదాన్ని. ప్రస్తుతం ఇంట్లోనే వర్కవుట్లు, యోగా చేస్తున్నా. పరిస్థితులు సద్దుమణిగాక జిమ్‌కు వెళ్తా. షూటింగ్స్ లేనప్పుడు మేకప్ వేసుకోను. హెయిర్ ప్యాక్ పెట్టుకుంటా. జుట్టుకు పెరుగు-నిమ్మరసం అప్లయ్ చేస్తుంటా. తరచూ కొబ్బరి నూనె పెట్టుకుంటాను.

నా చెల్లెలు నిషా, నేనూ స్నేహితుల్లా ఉంటాం. చిన్నప్పటినుంచీ అన్ని వస్తువులు షేర్ చేసుకునే వాళ్లం. నెయిల్ పాలిష్నుంచి హెయిర్ పిన్వరకు ఇచ్చి పుచ్చుకునేవాళ్లం. ఇప్పటికీ సరదాగా ఉంటాం. కలిస్తే మా మాటలు కోటలు దాటుతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

