బాలాసనం.. గర్భిణులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. పిల్లలు పడుకునే తీరును తలపించే ఈ భంగిమ మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. కాకపోతే, నిపుణుల సలహాతోనే చేయాలి.
ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. తర్వాత పాదాలపై పిరుదులు ఆనించి కూర్చోవాలి. దీన్నే ‘వజ్రాసనం’ అంటారు.
తర్వాత నిదానంగా ముందుకు వంగి నుదుటిని నేలకు తాకించాలి.
బాలాసన స్థితిలో 20 నుంచి 30 సెకండ్లపాటు ఉండాలి. శ్వాసక్రియ నిదానంగా కొనసాగించాలి. శ్వాసపై దృష్టి నిలపాలి. తర్వాత నిదానంగా మళ్లీ వజ్రాసన స్థితికి రావాలి.