వధువుకు ఏ డ్రెస్?
వివాహాల సీజన్ మొదలైంది. బంగారం షాపింగ్ నుంచి బ్యూటీ పార్లర్ వరకు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అందులోనూ పెండ్లి బట్టల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ‘ఒక్కపూట ధరించే డ్రెస్‌లకు ఇంత డబ్బు అవసరమా?’ అనే వాదన ఉంది. ఎండాకాలమైనా సరే.. పట్టుబట్టలు కట్టాల్సిందే అని పట్టుపడుతున్నవారూ ఉన్నారు. అసలు, వధువు ఎలాంటి వస్ర్తాలను ఎంచుకోవాలి? అనే కోణంలో ప్రఖ్యాత డిజైనర్ల అభిప్రాయాలు..
వివాహాల సీజన్ మొదలైంది. బంగారం షాపింగ్ నుంచి బ్యూటీ పార్లర్ వరకు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అందులోనూ పెండ్లి బట్టల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ‘ఒక్కపూట ధరించే డ్రెస్‌లకు ఇంత డబ్బు అవసరమా?’ అనే వాదన ఉంది. ఎండాకాలమైనా సరే.. పట్టుబట్టలు కట్టాల్సిందే అని పట్టుపడుతున్నవారూ ఉన్నారు. అసలు, వధువు ఎలాంటి వస్ర్తాలను ఎంచుకోవాలి? అనే కోణంలో ప్రఖ్యాత డిజైనర్ల అభిప్రాయాలు..
మనీశ్ మల్హోత్రా
బంధుమిత్రులు ఎంతమంది అయినా రానివ్వండి. వివాహం అనేది ప్రత్యేకించి వధూవరుల వేడుక. పెండ్లి బట్టల ఎంపికలో ఆ ఇద్దరి అభిరుచులకూ విలువ ఇవ్వాలి. నచ్చిన రంగులు, డిజైన్లు ఎంచుకునే అవకాశం ఉండాలి. అవి ఫ్యాషనబుల్‌గా అనిపించకపోయినా ఫర్వాలేదు. ఇక, డిజైనర్‌గా నా అభిప్రాయం చెప్పమంటే.. ప్రకృతి సిద్ధమైన రంగుల్లో అంతర్లీనంగా భారతీయత గోచరిస్తుంది. ఆభరణాల్లో పోల్కీ వజ్రాలు (కత్తిరించని వజ్రాలు) బావుంటాయి. వధువుకు కొత్త అందాన్ని ఇస్తాయి.
అబు జానీ – సందీప్ ఖోస్లా
షిఫాన్, జార్జెట్, ఖాదీ మొదలైన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే మంచిది. వాటిపైన రేషమ్ ఎంబ్రాయిడరీ, చికంకారీ వర్క్, సీక్విన్ వర్క్ ఆకర్షణీయంగా ఉంటాయి. అది వేసవి అయినా, శీతకాలమైనా పెండ్లి వేడుక జరిగే ప్రాంతాన్ని బట్టి లెహంగా, చీర, అనార్కలీలలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

అనామికా ఖన్నా
నేటితరం అమ్మాయిలు ఎక్కువ కాలం మన్నికవచ్చే వస్ర్తాలనే ఎంచుకుంటున్నారు. అదే మంచి పద్ధతి. ఇక ముహూర్తం సమయంలో ధరించే దుస్తులకు సౌకర్యం ముఖ్యం. బీచ్
వెడ్డింగ్‌లకు పగలు లైట్ కలర్స్ ఎంచుకోవాలి. రాత్రిళ్లు మెరూన్ వంటి ముదురు రంగులు బావుంటాయి. మొన్నటివరకూ పెండ్లి కూతుళ్లు చెప్పులు, హీల్స్ ఎంచుకునేవారు. ఇప్పుడు స్నీకర్స్పై ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే అవి డ్రెస్‌కు మ్యాచ్ కావాలి.
పాయల్ సింఘల్
వేసవిలో పెండ్లిల్లకు ఆర్గాంజా, సిల్క్, చందేరి, ముల్, తుల్లి, క్రేప్ మొదలైన తేలికపాటి దుస్తులు ఉత్తమం. మెడలో నాలుగైదు గొలుసులు కాకుండా ఒకటి లేదా రెండు మాత్రమే ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. కేశాలం కరణ విషయానికి వస్తే.. కొప్పు వేసుకోకుండా, వదులుగానే బావుంటుంది. కొల్హాపురీ చెప్పులు పాదాలకు అందాన్నిఇస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

