ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన భారతీయ భామ విమలా రామన్! సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్ విశ్వ విద్యాలయంలో చదువుకున్నది. అక్కడే భారతీయ సంప్రదాయ నృత్యాలూ నేర్చుకున్నది. బాలీవుడ్‌ను ఏలేద్దామని ఇండియాలో కాలుపెట్టింది.
తమిళంలో మంచి సినిమాలే చేసింది. తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ‘రుద్రంగి’లో నటిస్తున్నది. కాదుకాదు, జీవిస్తున్నది. తొమ్మిది రసాలను గంపగుత్తగా పండించడానికి ఆ రెండు కళ్లూ సరిపోతాయి.