టమాటాలో మన శరీరానికి మేలు చేసే గుణాలు చాలా ఉంటాయి. టమాటా రసాన్ని ముఖానికి అప్లయ్ చేస్తే.. జిడ్డు మాయమవుతుంది. దీనిని స్క్రబర్లా కూడా వాడొచ్చు. టమాటాని మిక్సీలోగానీ, బ్లెండర్లోగానీ వేసి గ్రైండ్ చేసి చర్మానికి బాగా పట్టించి.. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం నిగారిస్తుంది.
పుదీనాలో చాలా ఔషధగుణాలు ఉంటాయి. ఇది చర్మానికి కొత్త నిగారింపునిస్తుంది. కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని దానిని పేస్టులా చేసి అందులో ముల్తానీ మట్టి, తేనె, పెరుగు వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.