నా ఫస్ట్ సినిమా రిలీజయ్యే దాకా మా ఇంట్లో వాళ్లకు తెలియదు : కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram | మొదటి సినిమాతోనే ‘రాజావారు’ అనిపించుకున్నాడు. తాజాగా ‘సమ్మతమే’తో ప్రేక్షకుల సమ్మతం పొందాడు కిరణ్ అబ్బవరం. బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, గాడ్‌ఫాదర్ లేకపోయినా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడీ యంగ్ హీరో. సినిమాల మీదున్న ఇష్టంతో ఉద్యోగం వదిలేసి మరీ.. ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. సహజమైన నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందాడు. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీహీరోగా మారిన కిరణ్ జర్నీ ఆయన మాటల్లోనే..
సినిమాలంటే చిన్నప్పటినుంచీ ఇష్టం. కొత్త బొమ్మ వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే! సినిమాల ప్రభావంతో నటన అంటే ఆసక్తి ఏర్పడింది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే ఆలోచన మొదలైంది. ఉద్యోగం చేస్తూనే షార్ట్ఫిల్మ్స్లో నటించాను. ఐదారు షార్ట్‌ఫిల్మ్స్ తర్వాత ‘రాజావారు రాణిగారు’ సినిమా అవకాశం వచ్చింది. దాంతో తెరపై హీరోగా కనిపించాలన్న నా ఆశ నెరవేరింది.
ఉద్యోగం మానేసి..
మాది కడప జిల్లా రాయచోటి దగ్గర పెద్దకొడవండ్లపల్లి. పుట్టిందీ, పెరిగిందీ అక్కడే. కడప జిల్లాలోనే విద్యాభ్యాసం సాగింది. ఇంజినీరింగ్ తర్వాత బెంగళూరులో నెట్వర్క్ కన్సల్టెంట్‌గా చేరాను. కానీ, సినిమాల్లో నటించాలనే కోరిక నానాటికీ బలపడింది. అయితే, పరిశ్రమలో తెలిసిన వాళ్లెవరూ లేరు. అందుకే, ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో హైదరాబాద్ వచ్చి స్నేహితులతో కలిసి షార్ట్ఫిల్మ్స్లో నటించేవాణ్ని. కొన్నాళ్లకు ఉద్యోగం మానేసి నటనపైనే దృష్టి కేంద్రీకరించా. ‘రాజావారు రాణిగారు’ సినిమా విడుదలయ్యాక గానీ, నేను ఉద్యోగం మానేసిన సంగతి ఇంట్లోవాళ్లకు తెలియదు. అంత రహస్యంగా ఉంచాను.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తోనే..
నా రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచిపేరు వచ్చింది. గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్లలో అవకాశాలు వచ్చాయి. ‘సెబాస్టియన్’ ఒక ప్రయోగాత్మక సినిమా. నాలుగో సినిమా ‘సమ్మతమే’తో ప్రేక్షకులు హీరోగా నన్ను పూర్తిస్థాయిలో సమ్మతించారు. ఈ చిత్రాన్ని ‘ఆహా’ ఓటీటీలోనూ విశేషంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నేను నటించిన నాలుగు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
సెప్టెంబర్‌లో ‘నేను మీకు బాగా కావలసినవాడిని’ విడుదల కానుంది. తర్వాత.. ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘రూల్స్ రంజన్’. వచ్చే ఏడాది నాలుగు భాషల్లో ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే. కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించా. హీరోగా నన్ను నేను నిరూపించుకున్న తర్వాతే, మల్టీస్టారర్ సినిమాల గురించి ఆలోచిస్తా. వెబ్‌సిరీస్ అవకాశాలూ వస్తున్నాయి. కానీ, ఇప్పుడప్పుడే వాటిలో నటించాలని అనుకోవడం లేదు.
తప్పకుండా తిరిగిస్తా..
ప్రేమ, పెళ్లిపై ఇప్పుడే ఆలోచన లేదు. మంచి సినిమాలు చేసి సమర్థుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుంది. హీరోగా రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు నావల్ల నలుగురూ ఉపాధి పొందేలా ఏదో ఒకటి చేయాలి. నాకు జీవితాన్ని ఇచ్చిన సినీ పరిశ్రమకు ఎంతోకొంత తిరిగిస్తా. కథలు రాయడం, స్క్రిప్ట్ డెవలప్ చేయడం ఇష్టం. ఖాళీ దొరికితే క్రికెట్ ఆడతా. ప్రయాణాలూ ఇష్టమే! విదేశాల్లో కంటే వైజాగ్, కోనసీమ పరిసరాల్లోని ప్రకృతి ఒడిలో విహరించడం ఇష్టం.
…✍ ప్రవళిక వేముల
Read More :
“Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

