Chandini Chowdary | సంవత్సరాలపాటు ఏడవటం ప్రాక్టీస్ చేశా: చాందిని చౌదరీ
కలర్ ఫొటో సినిమాతో హీరోయిన్గా బ్రేక్ తెచ్చుకుంది వైజాగ్ భామ చాందినీ చౌదరి (Chandini Chowdary). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందినీ చౌదరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సమ్మతమే (Sammathame). జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కిరణ్, చాందినీ అండ్ టీం.
ఎస్ కల్యాణమండపం సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). కలర్ ఫొటో సినిమాతో హీరోయిన్గా బ్రేక్ తెచ్చుకుంది వైజాగ్ భామ చాందినీ చౌదరి (Chandini Chowdary). ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సమ్మతమే (Sammathame). జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కిరణ్, చాందినీ అండ్ టీం. కిరణ్-చాందినీ రీసెంట్గా అలీతో సరదా టాక్‌షోలో సందడిచేశారు. ఈ షోలో పలు విషయాలు పంచుకున్నారు.
‘చాందినీ చౌదరీ మాట్లాడుతూ..మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమాలంటే చాలా ఇష్టం. ఎక్కువగా హీరోలను ఇమిటేట్ చేసేదాన్ని. రజినీకాంత్ సార్‌ను ఎక్కువగా ఇమిటేట్ చేసేదాన్ని. నాకు జనాలంటే విపరీతమైన భయం.స్టేజ్ గ్రూప్ డ్యాన్స్ ఉంటే వెనకాల ఎక్కడో వెళ్లి..ఎవ్వరికి కనిపించకుండా డ్యాన్స్ చేసే వ్యక్తిని. ఏడో తరగతిలోనే సినిమా హీరోయిన్ను అవుతానని మా అమ్మకు చెప్పా. మనకయ్యేది కాదు లేఅమ్మా..మనకు బ్యాక్ గ్రౌండ్ లేదు..నువ్వు ఫొటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగలేవు..వద్దులే అనిచెప్పారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ చేశానంది’ చాందినీ.
‘ఇంటర్మీడియట్ టైంలోనే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని బాగా ఉండేది. ఓ ఫ్రెండ్ ద్వారా సుభాష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో రాజ్‌తరుణ్ ఉండేవాడు. నేను, రాజ్ తరుణ్ కలిసి షార్ట్స్ ఫిలిమ్స్ మొదలుపెట్టాం. షార్ట్ ఫిలిమ్స్ చేసేటపుడు మొదటి అమ్మాయిని నేనే. అప్పుడు అమ్మాయిలెవరూ ఉండేవాళ్లు కాదు. షార్ట్ ఫిలిమ్స్ బాగా హిట్టయ్యాయి. ఆ తర్వాత సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. కాకపోతే చదువు అయ్యాకే ఏదైనా అని మా ఇంట్లో చాలా ఖచ్చితంగా ఉండేవాళ్లు. నేనెప్పుడూ యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లలేదు.

నన్ను నేను అద్దంలో చూసుకుని, ఇంతకు ముందు చేసిన వర్క్ చూసుకొని ఇంకా ఏది బెటర్ అని ప్రాక్టీస్ చేసేదాన్ని. చాలా మంది నీ ఏడుపు బాగా లేదనేవారు..అందుకోసం చాలా ప్రాక్టీస్ చేశాను. సంవత్సరాల పాటు ఏడవటం ప్రాక్టీస్ చేశాను. ఏడవటం కూడా అందంగా, చూడటానికి రియలిస్టిక్‌గా ఉండాలి..అని ప్రాక్టీస్ చేశాను. అది కలర్ ఫొటో సినిమాలో గ్లిసరిన్ లేకుండా చాలా బాగా పండింది..చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది చాందినీ చౌదరి.
ఇక సినీ పరిశ్రమలో మీ రోల్ మోడల్ ఎవరని ప్రశ్నించగా..తనకు ప్రత్యేకించి రోల్ మోడల్ అంటూ ఎవరులేరని..తన ప్రయాణమే తనకు రోల్ మోడల్ అని చెప్పాడు కిరణ్ అబ్బవరం.
Read Also : Chinmayi Sripada | కవల పిల్లలకు చిన్మయి శ్రీపాద వెల్కమ్..పోస్ట్‌తో గాసిప్స్ కు చెక్
Read Also : Chiru Salman party | పార్టీలో చిరు-వెంకీ-సల్మాన్ సందడి..ఇంతకీ స్పెషలేంటో..?
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

