Ramarao On Duty Trailer | కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్రాజ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈయన సినిమాల నుంచి వస్తున్న అప్డేట్స్ ఏ హీరో సినిమాల నుంచి కూడా రావడంలేదు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ టైంను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం రాత్రి 8.01 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఇక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు. సామ్ సీ.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్లుగా నిలిచాయి.
8:01 PM TODAY 🔥 Kaluddham 😊#RamaRaoOnDuty pic.twitter.com/qRbKtxQ6Qm
— Ravi Teja (@RaviTeja_offl) July 16, 2022
Read Also:
Chandramukhi-2 | ‘చంద్రముఖి’ సీక్వెల్ మొదలైంది.. వైరల్ అవుతున్న లాంఛింగ్ ఫోటోస్
NBK107 Movie | దసరా రేసు నుండి తప్పుకుంటున్న బాలకృష్ణ.. కారణం ఇదేనట?
Chiranjeevi | అమీర్‌ఖాన్ నటనపై చిరు ప్రశంసలు.. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రివ్యూ వీడియో వైరల్