ఇమ్యూనిటీకి హై కమాండ్ థైమస్ గ్రంథి!
ఇప్పటివరకు చాలామందికి పెద్దగా తెలియని థైమస్ అనే చిన్న గ్రంథి ఇప్పుడు ప్రపంచ వైద్య పరిశోధనల్లో హాట్ టాపిక్‌గా మారింది. మన ఛాతీలో గుండె దగ్గర ఉండే ఈ చిన్న అవయవం శరీర రోగనిరోధక శక్తికి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటివరకు చాలామందికి పెద్దగా తెలియని థైమస్ అనే చిన్న గ్రంథి ఇప్పుడు ప్రపంచ వైద్య పరిశోధనల్లో హాట్ టాపిక్‌గా మారింది. మన ఛాతీలో గుండె దగ్గర ఉండే ఈ చిన్న అవయవం శరీర రోగనిరోధక శక్తికి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యం, క్యాన్సర్, వైరల్ ఇన్ఫెక్షన్లు, దీర్ఘాయుష్షుతో ఈ గ్రంథికి గాఢ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రముఖ మెడికల్ జర్నల్ నేచర్‌లో ఇటీవల దీనికి సంబంధించిన రెండు అధ్యయనాలు ప్రచురితమయ్యాయి. థైమస్ గ్రంథి శరీరంలో టి-సెల్స్ అనే ముఖ్యమైన రోగనిరోధక కణాలను తయారు చేస్తుంది. ఇవే వైరస్లు, బ్యాక్టీరియా, క్యాన్సర్ కణాలపై పోరాడే ప్రధాన సైనికులు.
పిల్లల్లో ఈ గ్రంథి చాలా చురుకుగా పనిచేస్తుంది. కానీ, వయసు పెరిగేకొద్దీ ఇది క్రమంగా చిన్నదై కొవ్వుగా మారిపోతుంది. దీనినే థైమిక్ ఇన్వల్యూషన్ అంటారు. దీంతో ఇమ్యూనిటీ బలహీనమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు అమెరికాలో ఇప్పటికే జరుగుతున్న రెండు భారీ ఆరోగ్య ప్రాజెక్టుల డేటాను ఉపయోగించి ఈ గ్రంథి పని పనితీరుకి-ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాలను కనుగొన్నారు. ఆరోగ్యంగా ఉన్న థైమస్ కలిగిన వ్యక్తుల్లో క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉండటం, గుండె జబ్బుల ముప్పు తగ్గడం, వీటితో పాటు వృద్ధాప్య కారణాలతో కలిగే మరణాల రేటు తక్కువగా ఉండటం గమనించారు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఇమ్యూన్ ఏజింగ్‌కు కీలక సూచికగా పేర్కొంటున్నారు.
ఈ గ్రంథి బలంగా ఉన్న వారిలో… వైరల్ ఇన్ఫెక్షన్లు తక్కువగా కనిపించాయట. వ్యాధుల నుంచి కోలుకునే వేగం ఎక్కువగా ఉండటంతో పాటు కొత్త వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు తేలింది. అంతేకాదు, శరీర కణాలు వృద్ధాప్యం దిశగా మార్పు చెందడం నెమ్మదించవచ్చు. అలసట, శరీరంలో వాపులు తగ్గడంతో పాటు మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా ఇది వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే అవయవంగా చెబుతున్నారు. ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగుల్లో థైమస్ ఆరోగ్యంగా ఉన్నవారికి చికిత్స మెరుగ్గా పనిచేసింది. వారి జీవనకాలం కూడా ఎక్కువగా ఉంది. రోజూ వ్యాయామం, సమయానికి నిద్ర, పసుపు, ఆకుకూరలు, పండ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం, ఒత్తిడి తగ్గించుకోవడం, ధూమపానం మానేయడం లాంటి వాటి ద్వారా థైమస్ను ఆరోగ్యంగా ఉంచుకొని, రోగ నిరోధక వ్యవస్థను బలపరుచుకోవచ్చు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

