Health Tips | ఆరోగ్యరంగంలో సరికొత్త ట్రెండ్స్.. 2024లో అశ్వగంధదే అగ్రపీఠమా ?
Health Tips | అనారోగ్యం ఎంత ఇబ్బందికరమో ఈతరం గ్రహిస్తున్నది. క్రమంగా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ పెరుగుతున్నది. అందుకు సూచనగా, ఆరోగ్యరంగంలో సరికొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిని శాసించనున్న కొన్ని ధోరణులు..
Health Tips | అనారోగ్యం ఎంత ఇబ్బందికరమో ఈతరం గ్రహిస్తున్నది. క్రమంగా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ పెరుగుతున్నది. అందుకు సూచనగా, ఆరోగ్యరంగంలో సరికొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిని శాసించనున్న కొన్ని ధోరణులు..
వృక్ష మిత్ర
ప్లాంట్ బేస్డ్ ఫుడ్ పట్ల ఆదరణ పెరుగుతున్నది. పాలిష్ చేయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు, పీచుపదార్థం ఎక్కువ ఉండే ఆహారం, పప్పులు, గింజలు.. తదితర ఆహారంతో రక్తపోటు అదుపులో ఉంటుందని, ఊబకాయ సమస్యలు రావని తెలియడమే ఇందుకు కారణం.
న్యూరోప్లాస్టిసిటీ
ఒకసారి వ్యక్తిత్వం స్థిరపడిపోయాక, ఇక మార్పు అసాధ్యంగా తోస్తుంది. ఒక వయసు దాటాక మన ఆలోచన, అలవాట్లు స్థిరంగా ఉండిపోతాయి. ఈ అభిప్రాయాలు తప్పు అని నిరూపించేదే ప్లాస్టిసిటీ. మన ఆలోచనా ధోరణి, దినచర్య, స్పందించే విధానం అన్నీ మార్చేసుకుని.. ఏకంగా మెదడు పనితీరునే మనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నది న్యూరోప్లాస్టిసిటీ.
మెనోపాజ్‌లో
బహిష్టు ఆగిపోయే సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల రకరకాల మానసిక, శారీరక ఇబ్బందులు వస్తాయి. ఇప్పటివరకూ వీటిని పంటిబిగువున ఓర్చుకునేవారు. కానీ ట్రెండ్ మారింది. ఈ సమయంలో ఉపశమనాన్ని అందించే స్పాలు, పంచకర్మ ప్రక్రియలు, హార్మోన్ చికిత్సలు వస్తున్నాయి.
లైట్ థెరపీ
నిర్దిష్టమైన కాంతి మన చర్మం మీద పడేలా ఉంచడమే లైట్ థెరపీ. దీనివల్ల మన కణాలలోని శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా ఉత్తేజితం అవుతుందని నమ్మకం. తద్వారా మొటిమల నుంచి అల్జీమర్స్ వరకు ఎన్నో సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు.
అశ్వగంధ
ఈ ఆయుర్వేద ఔషధాన్ని లోకమంతా తలకెత్తుకుంటున్నది. ఇందులోని అడాప్టొజెన్స్ అనే రసాయనాల గురించి అవగాహన పెరగడమే ఈ ట్రెండ్‌కు కారణం. ఇవి ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి లాంటి ఎన్నో సమస్యలను తొలగిస్తాయని తేలింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fitness
- health sector
- illness
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

