గ్రీన్ ఫ్యాషన్ కి జై!!
నేటి తరం కేవలం అందంగా కనిపించడమే కాదు, బాధ్యతగా ఉండటాన్ని కూడా ఇష్టపడుతున్నది. అందుకే ఇప్పుడు ‘సస్టెయినబుల్ ఫ్యాషన్' (సుస్థిర ఫ్యాషన్) ఒక విప్లవంలా మారింది.
నేటి తరం కేవలం అందంగా కనిపించడమే కాదు, బాధ్యతగా ఉండటాన్ని కూడా ఇష్టపడుతున్నది. అందుకే ఇప్పుడు ‘సస్టెయినబుల్ ఫ్యాషన్’ (సుస్థిర ఫ్యాషన్) ఒక విప్లవంలా మారింది. రసాయన రంగులు, ప్లాస్టిక్ మిశ్రమాలతో చేసే ఫాస్ట్ ఫ్యాషన్‌కు బై-బై చెప్తూ.. ప్రకృతికి హాని చేయని దుస్తుల వైపు యువత మొగ్గు చూపుతున్నది. స్టయిల్‌కి స్టయిల్, పర్యావరణానికి రక్షణ.. ఇదీ నేటి తరం ఫ్యాషన్ మంత్ర!
ప్రకృతి సిద్ధ కాన్సెప్ట్: ఆర్గానిక్ కాటన్, లినెన్, వెదురు పీచు (బ్యాంబూ ఫ్యాబ్రిక్), జనపనారతో తయారయ్యే దుస్తులకు డిమాండ్ పెరుగుతున్నది. ఇవి చర్మానికి ఏమాత్రం హాని చేయవు.
రీసైకిల్డ్ – అప్సైకిల్డ్ స్టయిల్: పాత దుస్తులు పారేయకుండా, వాటికి సరికొత్త డిజైన్లను అద్ది ‘అప్‌సైకిల్’ చేయడం ఇప్పుడు పెద్ద ట్రెండ్. పాత కాంచీపురం చీరను మోడ్రన్ లాంగ్ గౌన్ గానో, పాత జీన్స్‌ను ైస్టెలిష్ జాకెట్గానో మార్చేస్తున్నారు.
సహజ సిద్ధమైన రంగులు: కెమికల్స్ కాకుండా.. మొక్కలు, పూలు, కూరగాయల నుంచి తీసిన సహజ రంగులను ఈ దుస్తుల్లో వాడతారు. ఇవి చూసేందుకు ఎంతో క్లాసీగా, అందంగా ఉంటాయి.
స్టైలింగ్ టిప్స్
ఎక్కువ దుస్తులు కొని వార్డ్రోబ్ నింపేయడం కంటే.. నాణ్యమైన, ఎక్కువ కాలం మన్నే ‘ఎకో-ఫ్రెండ్లీ’ దుస్తులను ఎంచుకోవడమే స్మార్ట్ ఫ్యాషన్. ఒకే డ్రెస్‌ను భిన్నమైన యాక్సెసరీస్‌తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి రకరకాలుగా ధరించవచ్చు. భూమిని ప్రేమిస్తూ, మనల్ని మనం మరింత అందంగా మార్చుకునే ఈ ‘గ్రీన్ ైస్టెల్’ను మీరు కూడా ఈరోజే ట్రై చేయండి! పర్యావరణానికి ‘ైస్టెలిష్’ రక్షణ కల్పించండి!!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

