పిల్లలు చెడు అనొద్దంటే..
పిల్లల పద సంపదకు పెద్దల మాటలే ప్రేరణ. అయితే ఆ పెద్దలు తరచూ అసభ్య పదాలు వాడేస్తుంటే... ఆ ప్రభావం పిల్లలపైనా పడుతుంది. పిల్లలు మొదట్లో తిట్లు, పరుష పదాలు పలికితే ప్రోత్సహించే పెద్దలూ ఉంటారు. పిల్లల ఈ ప్రవర్తన మొదట్లో సరదాగా అనిపించినా, అది వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సైకాలజీ ప్రకారం పిల్లలు పదజాలం పెద్దలు స్పందించే తీరును బట్టి పెరుగుతుంది. పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు పెద్దలు నవ్వితే, అది వారికి ఇది సరదాగా ఉంది, మళ్లీ చెబితే అందరూ నవ్వుతారు అనే సంకేతాన్ని ఇస్తుంది.
పిల్లల పద సంపదకు పెద్దల మాటలే ప్రేరణ. అయితే ఆ పెద్దలు తరచూ అసభ్య పదాలు వాడేస్తుంటే… ఆ ప్రభావం పిల్లలపైనా పడుతుంది. పిల్లలు మొదట్లో తిట్లు, పరుష పదాలు పలికితే ప్రోత్సహించే పెద్దలూ ఉంటారు. పిల్లల ఈ ప్రవర్తన మొదట్లో సరదాగా అనిపించినా, అది వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సైకాలజీ ప్రకారం పిల్లలు పదజాలం పెద్దలు స్పందించే తీరును బట్టి పెరుగుతుంది. పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు పెద్దలు నవ్వితే, అది వారికి ఇది సరదాగా ఉంది, మళ్లీ చెబితే అందరూ నవ్వుతారు అనే సంకేతాన్ని ఇస్తుంది. ఈ విధంగా చిన్నారులు ఆ పదాలను మళ్లీ మళ్లీ ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఇది క్రమంగా అలవాటుగా మారి, పిల్లల భాషా ప్రవర్తనలో భాగమవుతుంది.
పిల్లలు భాషను కేవలం సంభాషణ సాధనంగా కాకుండా సామాజిక స్పందన పొందడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే, వారు ఏదైనా పదం వల్ల ఎకువ స్పందన వస్తే, దాన్ని మరింతగా ఉపయోగిస్తారు. చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు పెద్దలు కోప్పడినా, నవ్వినా, లేదా ఎకువగా రియాక్ట్ అయినా, అది పిల్లలకు ఒక రకమైన ప్రోత్సాహంగానే ఉంటుంది. అందుకే పిల్లలు అసభ్య పదాలు మాట్లాడినప్పుడు అధికంగా స్పందించకుండా, ప్రశాంతంగా సరిదిద్దాలి. ఈ రోజుల్లో డిజిటల్ కంటెంట్ వల్ల వయసుకు మించిన పదాలు త్వరగా నేర్చుకునే అవకాశం ఉంది.
అందుకే తమ పిల్లలు ఏం చూస్తున్నారు, ఎవరితో ఎకువ సమయం గడుపుతున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు తప్పక గమనించాలి. చిన్నతనం నుంచే చెడ్డ మాటలు మాట్లాడడం అలవాటైతే సూల్లో, బయట ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా అదే భాషను ఉపయోగిస్తారు. దీని వల్ల టీచర్లతో, స్నేహితులతో సంబంధాలు దెబ్బతింటాయి. ఇది వారి వ్యక్తిత్వంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు తల్లిదండ్రులు పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించాలి. పిల్లలు బూతులు మాట్లాడినప్పుడు దాన్ని సరదాగా తీసుకోకుండా, అది సరైన పదం కాదని సున్నితంగా చెప్పాలి. ఇలా మాట్లాడితే ఎదుటివాళ్లు బాధపడతారు అని వారికి అర్థమయ్యేలా వివరించాలి. పిల్లలకు సరైన పదాలను నేర్పించాలి. పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. వారు ఏ పదం ఎకడ విన్నారో తెలుసుకోవడం ద్వారా సమస్యను మూలంలోనే పరిషరించవచ్చు. వారిని మందలించడం కంటే, అర్థం చేసుకోవడం, మార్గనిర్దేశం చేయడం మంచిది. అలాగే, పిల్లలు మంచి భాష ఉపయోగించినప్పుడు వారిని ప్రోత్సహించడం కూడా అవసరం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

