విజయం, పరాజయం అనేవి ఒకే నాణేనికి రెండు పార్శాల లాంటివి. సమదృష్టి ఉన్నవారికి ఈ రెండిటిలో వైరుధ్యం ఏమీ కనిపించదు. సందర్భాన్ని అనుసరించి మన భావాలను వ్యక్తీకరించడం, మౌనంగా ఉండటం, పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భాల్లో సమదృష్టితో వ్యవహరించడానికి అవగాహన, సహనం అవసరమవుతాయి. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగడానికి సమదృష్టిని కలిగి ఉండటమే అత్యుత్తమమైన మధ్యేమార్గం.
– స్వామి యోగతీర్థానంద సరస్వతి