కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: పది (చిన్నవి), నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: ఒక టీస్పూన్, బటర్: ఒక టేబుల్ స్పూన్, నూనె: ఒక టేబుల్ స్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారీ విధానం
ఆలుగడ్డల్ని తొక్కతీసి నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె, బటర్ వేయాలి. వేడయ్యాక జీలకర్ర, ఆలుగడ్డ ముక్కలు, నువ్వులు వేసి సన్నని మంటపై వేయించాలి. రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఆలుగడ్డలు వేగాక కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే వేడివేడి స్పైసీ సెసమీ పొటాటోస్ సిద్ధం.