Sonam Kapoor | ‘టేట్ మాడ్రన్..’ ప్రపంచంలోని ఆధునిక, సమకాలీన కళలకు ఆలవాలమైన అతిపెద్ద మ్యూజియంలలో ఒకటి. లండన్‌లోని ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం తన దక్షిణాసియా అక్విజిషన్ కమిటీలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌ను సభ్యురాలిగా చేర్చుకున్నది. టేట్ మాడ్రన్ ద్వారా చాంపియన్ ఇండియన్, సౌత్ ఏషియన్ ఆర్ట్‌లో ఈ కీలక సభ్యత్వ స్థానానికి ఎంపికైన ఏకైక భారతీయ నటిగా నిలిచింది సోనమ్ కపూర్.
‘ప్రపంచ ప్రఖ్యాత టేట్ మాడ్రన్ వారి సౌత్ ఏషియన్ అక్విజిషన్ కమిటీ మెంబర్‌గా చేరడం ఎంతో గర్వంగా ఉంది. భారతీయ, దక్షిణాసియా కళా వారసత్వం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్నది. మన కళాఖండాలు ఈ చరిత్రాత్మక వేదికపై ఉంచేందుకు, కళాకారుల అభ్యున్నతికి కృషి చేయడానికి వీలు చిక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం నా ఒక్కదానికే కాదు, మొత్తం ఆర్ట్ కమ్యూనిటీకి గర్వకారణం’ అని చెప్పుకొచ్చింది సోనమ్ కపూర్.