ఆరోగ్య సాధనలో చర్మ సౌందర్యం కూడా ఒకటి. ముఖం ఒక్కటీ శుభ్రం చేసుకుంటే సరిపోదు. కాళ్లు, చేతులు కూడా శుభ్రంగా ఉంటేనే మేలు. అయితే చర్మ సౌందర్యం కోసం మనం చేసే కొన్ని పనులు దేహానికి నష్టం కలిగిస్తుంటాయి. అవేంటంటే..

వానకాలం వచ్చిందంటే చాలు.. వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు కొందరు. వేసవిలో మరీ చల్లని నీటితో స్నానం చేస్తారు. ఈ రెండూ తప్పే! ఏ కాలమైనా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదమూ ఉంది.
మాయిశ్చరైజర్ రాసుకోవడానికి కొందరు బద్ధకిస్తుంటారు. దీనివల్ల చర్మం పెళుసుగా మారుతుంది. రోజూ కాకున్నా, వారానికి ఒకట్రెండుసార్లు స్నానం చేసిన తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తూ ఉండాలి.
తెలుపురంగులో ఉండే ఫేస్క్రీమ్లు మనం నిల్వ ఉంచే వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు లేత పసుపు రంగులోకి మారుతుంటాయి. నిర్దేశిత గడువు ఇంకా ఉంది కదా! అని రంగు మారిన వాటిని ఉపయోగిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చు.