చర్మానికి రక్ష.. స్కిన్ బ్యారియర్ కేర్!
అందమైన చర్మానికి కేవలం ఖరీదైన క్రీములు సరిపోవు. ఈ మధ్యకాలంలో బ్యూటీ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న ట్రెండ్ ‘స్కిన్ బ్యారియర్ కేర్'. అంటే చర్మం సహజంగా కలిగి ఉండే రక్షణ పొరను బలంగా ఉంచడంపై దృష్టి పెట్టడం.
అందమైన చర్మానికి కేవలం ఖరీదైన క్రీములు సరిపోవు. ఈ మధ్యకాలంలో బ్యూటీ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న ట్రెండ్ ‘స్కిన్ బ్యారియర్ కేర్’. అంటే చర్మం సహజంగా కలిగి ఉండే రక్షణ పొరను బలంగా ఉంచడంపై దృష్టి పెట్టడం. ఈ రక్షణ పొర దెబ్బతింటే చర్మం పొడిబారడం, ఎర్రబడటం, మంట, మొటిమలు లాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. స్కిన్ బ్యారియర్‌ను ఆరోగ్యంగా ఉంచాలంటే ముఖాన్ని రోజుకు రెండుసార్లు మాత్రమే మృదువైన క్లెన్సర్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత సిరామైడ్స్, హ్యాలురానిక్ యాసిడ్ లేదా గ్లిజరిన్ ఉన్న మాయిశ్చరైజర్‌ను వాడితే చర్మంలో తేమ నిలిచి ఉంటుంది.
బయటికి వెళ్లేటప్పుడు ఎస్పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. వారానికి ఒకసారి కంటే ఎక్కువగా స్క్రబ్ చేయడం, ఒకేసారి చాలా రకాల యాక్టివ్ ఇంగ్రీడియంట్లు ఉపయోగించడం వల్ల చర్మ రక్షణ పొర బలహీనపడే ప్రమాదం ఉంది. కాబట్టి చర్మం చెప్పే సంకేతాలను గమనిస్తూ, అవసరమైన ఉత్పత్తులనే ఎంచుకోవడం మంచిది. అంతేకాదు, తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం. చర్మాన్ని అతిగా ప్రయోగాలకు గురిచేయకుండా, సహజ సమతుల్యతను కాపాడుకోవడమే ఈ కొత్త బ్యూటీ ట్రెండ్ సందేశం. తక్కువ ఉత్పత్తులతో, సరైన సంరక్షణతోనే సహజమైన మెరుపును సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

