సిజేరియన్లపై షార్ట్‌ఫిల్మ్ రూపొందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం.. త్వరలో విడుదల
Short Flim on Cesarean deliveries | సినిమా తిరుగులేని మాధ్యమం. ప్రతి దృశ్యం, ప్రతి సంభాషణ నేరుగా మనసును తాకుతుంది. గుండెను కదిలిస్తుంది. కాబట్టే, సిజేరియన్ కాన్పులతో పోలిస్తే, ప్రకృతి సిద్ధమైన ప్రసూతి అన్ని విధాలా క్షేమమని చాటుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ఓ లఘుచిత్రాన్ని రూపొందించింది.
సహజ ప్రసవాలు ప్రకృతిసిద్ధం. అందుకు విరుద్ధంగా ప్రజలు సిజేరియన్ కాన్పుల వైపు మొగ్గు చూపుతున్నారు. శిశువు గర్భంలో ఉండగానే ముహూర్తాల ప్రకారం సిజేరియన్లు చేయించుకుంటున్నారు. నార్మల్ డెలివరీలు తల్లీబిడ్డల ఆరోగ్యానికి శ్రేయస్కరమని, శస్త్ర చికిత్సలతో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తుతాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం, మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు పదిశాతానికి మించకూడదు. కానీ ఈ లెక్క ఎప్పుడో అదుపు తప్పింది. ఈ ఆందోళనకర ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు.. రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో ఓ ఉద్యమం చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచే ప్రయత్నంలో ఇదో భాగం. సాధారణ ప్రసవాల వల్ల ప్రయోజనాలు.. అదే సమయంలో సిజేరియన్ల వల్ల అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నది. సినిమా
పదునైన మాధ్యమం. అందుకే, షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలని భావించారు కలెక్టర్. డీపీఆర్వో కార్యాలయ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులే నటీనటులుగా ఓ లఘుచిత్రం రూపొందించారు. దానికి ‘సిజేరియన్లకు కత్తెరేద్దాం’.. అనే టైటిల్ ఖరారు చేశారు. జిల్లా పౌరసంబంధాల అధికారి మామిండ్ల దశరథం పర్యవేక్షణలో, తెలంగాణ సాంస్కృతిక సారథి దొబ్బల ప్రకాశ్ దర్శకత్వంలో మూడు నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రాణంపోసుకుంది. జిల్లా దవాఖానతోపాటు తంగళ్లపల్లి మండలంలోని తాడూరులో సన్నివేశాలను చిత్రీకరించారు. విడుదల త్వరలోనే!
అవగాహనే లక్ష్యం
‘రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నట్లు గుర్తించాం. ప్రభుత్వ దవాఖానల కంటే ప్రైవేటు హాస్పిటల్స్‌లోనే ఈ కోతలు అధికంగా జరుగుతున్నాయి. ప్రతి సిజేరియన్నూ ఆడిట్ చేసి రిపోర్ట్ అందించాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించాం. అవసరం లేకున్నా చేసినట్లు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా చైతన్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం’ అంటున్నారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

