ట్విస్టులే ట్విస్టులు!
నేరపరిశోధన చిత్రాలకు ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. కథలో బిగింపు ఉంటే ఈ తరహా చిత్రాలకు ఢోకా ఉండదు. ఆద్యంతం ఊహించని మలుపులతో సాగిపోయే ‘పోర్ తొళిల్' కూడా ఈ తరహా చిత్రమే! తమిళనాట బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. కథలోకి వెళ్తే.. క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) దగ్గర డీఎస్పీ ప్రకాశ్ (అశోక్ సెల్వన్) ట్రైనీగా చేరుతాడు.
పోర్ తొళిల్
సోనీలివ్: ఆగస్టు 11
తారాగణం: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, శరత్ బాబు, నిఖిలా విమల్ తదితరులు
దర్శకత్వం: విఘ్నేష్ రాజా
నేరపరిశోధన చిత్రాలకు ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. కథలో బిగింపు ఉంటే ఈ తరహా చిత్రాలకు ఢోకా ఉండదు. ఆద్యంతం ఊహించని మలుపులతో సాగిపోయే ‘పోర్ తొళిల్’ కూడా ఈ తరహా చిత్రమే! తమిళనాట బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. కథలోకి వెళ్తే.. క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) దగ్గర డీఎస్పీ ప్రకాశ్ (అశోక్ సెల్వన్) ట్రైనీగా చేరుతాడు. అదేరోజు జంట హత్యల కేసు లోకనాథన్కు అప్పగిస్తారు పై అధికారులు. కేసు పరిశోధన కోసం లోకనాథన్, ప్రకాశ్ తిరుచ్చి బయల్దేరుతారు. వీరి వెంట టెక్నికల్ అసిస్టెంట్ వీణ (నిఖిల) కూడా వెళ్తుంది.
కేసు పరిశోధన సాగుతుండగానే మరో ఇద్దరు మహిళలు హత్యకు గురవుతారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దారుణాలు చేస్తున్న వ్యక్తి ఎవరు? పోలీసులు అతణ్ని ఎలా పట్టుకున్నారన్నది మిగిలిన కథ. శరత్‌కుమార్, అశోక్ సెల్వన్ నటన సినిమాకు హైలైట్. కీలక పాత్రలో శరత్‌బాబు కనిపిస్తారు. ఇక దర్శకుడు విఘ్నేష్ రాజా చిత్రాన్ని నడిపించిన తీరు బాగుంది. వరుస ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. కథనం అక్కడక్కడా నెమ్మదించినా ప్రీ క్లయిమాక్స్‌లో ఊహించని మలుపుతో ఆ లోపాన్ని తెలివిగా అధిగమించాడు దర్శకుడు. మాతృక తమిళం అయినా తెలుగు, హిందీ, మలయాళం డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

