Rare Disease Day | మీకు ఈ విషయం తెలుసా.. అరుదైన వ్యాధులకూ ఓ రోజు
Rare Disease Day | ఏటా ఫిబ్రవరి నెల చివరి రోజును అరుదైన వ్యాధుల (రేర్ డిసీజెస్) దినంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 40 కోట్లు ఉంటుంది. ప్రతి లక్ష మందిలో 50 నుంచి 65 మంది మాత్రమే ఓ రుగ్మత బారిన పడితే దాన్ని అరుదైన వ్యాధిగా పరిగణిస్తారు. వీటిలో చాలావరకు జన్యు సంబంధమైనవే ఉంటాయి.
Rare Disease Day | ఏటా ఫిబ్రవరి నెల చివరి రోజును అరుదైన వ్యాధుల (రేర్ డిసీజెస్) దినంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 40 కోట్లు ఉంటుంది. ప్రతి లక్ష మందిలో 50 నుంచి 65 మంది మాత్రమే ఓ రుగ్మత బారిన పడితే దాన్ని అరుదైన వ్యాధిగా పరిగణిస్తారు. వీటిలో చాలావరకు జన్యు సంబంధమైనవే ఉంటాయి. ఇలాంటి వ్యాధుల కచ్చితమైన నిర్ధారణకు ఏండ్ల సమయం పడుతుంది. 95 శాతం వ్యాధులకు సరైన చికిత్సలు కూడా లేవు. సంవత్సరంలోని అన్ని నెలలూ 30 లేదా 31 రోజులను కలిగి ఉంటాయి. ఒక్క ఫిబ్రవరిలో మాత్రమే తక్కువ రోజులు (28, లీపు సంవత్సరం అయితే 29) ఉంటాయి.
అందుకే అరుదైన వ్యాధుల కోసం.. ఏరికోరి ఫిబ్రవరి మాసాన్ని ఎంచుకున్నారు. దీన్ని 2008 ఫిబ్రవరి 29న తొలిసారిగా జరుపుకొన్నారు. ఫిబ్రవరి 29 నాలుగేండ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి, మిగిలిన సంవత్సరాల్లో ఫిబ్రవరి 28 నాడు అరుదైన వ్యాధుల దినాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారాన్ని అరుదైన వ్యాధుల వారంగా కూడా పరిగణిస్తారు. ఈ ఏడు రోజులూ ఆయా వ్యాధుల బారినపడిన వారికి రోగ నిర్ధారణ పరీక్షలు జరిపిస్తారు. చికిత్స సమకూరుస్తారు. సామాజిక మద్దతు అందిస్తారు. ఆయా రుగ్మతల పట్ల చైతన్యం కల్పిస్తారు. అరుదైన వ్యాధుల పరిశోధనకు విరాళాలు సేకరిస్తారు. ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

