అర్థం చేసుకోవడానికి.. అర్ధగంట
స్క్రీన్‌కి అతుక్కుపోయే పిల్లలను ఎలా బయటపడేయాలని పెద్దవాళ్లు ఆలోచిస్తుంటారు. అది తర్వాత.. ముందు తల్లిదండ్రులు ఆ స్క్రీన్ సమస్యను అధిగమించడం కోసం ఏం చేయాలో ఆలోచించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
స్క్రీన్‌కి అతుక్కుపోయే పిల్లలను ఎలా బయటపడేయాలని పెద్దవాళ్లు ఆలోచిస్తుంటారు. అది తర్వాత.. ముందు తల్లిదండ్రులు ఆ స్క్రీన్ సమస్యను అధిగమించడం కోసం ఏం చేయాలో ఆలోచించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు మల్టీ టాస్క్‌లు, హెవీ వర్క్, స్ట్రెస్ వల్ల పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఇంట్లో పిల్లలతో కలిసి ఉండటమే కానీ, వాళ్లతో ఆత్మీయానుబంధాన్ని మాత్రం కొనసాగించలేకపోతున్నారు.
ఈ జీవన శైలి పెరిగే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని పనులున్నా, ఎంత ఆందోళన ఉన్నా రోజులో కనీసం 30 నిమిషాలు పిల్లలకు కేటాయించాలంటున్నారు. అంత సమయం ఒకేసారి కేటాయించకుండా.. ప్రతి సందర్భంలో పది నిమిషాల చొప్పున రోజులో మూడుసార్లు పిల్లలతో ప్రేమగా గడపాలంటున్నారు.
ప్రేమకు సమయం ప్రమాణం కాదు. కానీ, నేటి జీవన శైలి, కుటుంబ అవసరాల వల్ల కనీసం గడపాల్సిన సమయాన్ని గుర్తు చేయడం అనివార్యం అవుతున్నది. స్కూల్ నుంచి రాగానే పిల్లలతో పది నిమిషాలపాటు గడపాలి. వాళ్ల ఆసక్తిని బట్టి మాట్లాడాలి. వాళ్లు చెప్పేది వినాలి. రాగానే హోమ్ వర్క్, స్కూల్ వర్క్ గురించి మాట్లాడి పది నిమిషాలు గడిపేశాం అనుకోవద్దు.
వాళ్లు ఏది చెబుతారో ఆ విషయాలపట్ల ఆసక్తిగా ఉన్నారని గుర్తించి అదే మాట్లాడండి. రాత్రి పడుకునే ముందు మరో పది నిమిషాలు మాట్లాడుతూ వాళ్లని నిద్రపుచ్చండి. ఇక మూడో పది నిమిషాలు ఏ సమయంలోనైనా వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా గడపండి. ఇలా పిల్లలు తల్లిదండ్రులతో పెరగడం వల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వాళ్ల సమస్యలు పెద్దవి కాకముందే తెలిసిపోతాయి. పిల్లల మనసులో ప్రతికూల ఆలోచనలు మొగ్గతొడగవు. ఇలా ప్రతి రోజూ కనీసం అర్ధగంట సమయం పిల్లలకు కేటాయించండి. కుదిరితే అంత కంటే ఎక్కువ సమయం గడపండి. ముందు అనుకున్నాం కదా ప్రేమకు సమయం ప్రమాణం కాదని. వాళ్లతో సమయం ఎంత సంతోషంగా గడిచింది అన్నదే ముఖ్యం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

