పార్శ కోణాసనంతో..ఆర్థరైటిస్‌కు చెక్

గర్భిణి తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక యోగాసనాలు ఉన్నాయి. వాటిని ప్రయత్నించడం వల్ల , బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. గర్భిణులకు ఎదురయ్యే ఆర్థరైటిస్ సమస్యను దూరం చేస్తుంది పార్శకోణాసనం.
ముందుగా నిటారుగా తాడాసన స్థితిలో నిల్చోవాలి. రెండు కాళ్ల మధ్య మూడు నుంచి నాలుగు అడుగుల దూరం ఉండేలా చాపాలి. కాళ్లకు సమాంతరంగా చేతులను చాచాలి.
ఇప్పుడు కుడికాలిని మోకాలు దగ్గర 90 డిగ్రీలు వంచాలి. మోకాలు, పిక్కలను టైట్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాసను నిదానంగా వదులుతూ కుడి చేతిని పాదం దగ్గర భూమికి ఆనించి నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఈ సమయంలో పొట్ట మీద ఒత్తిడి లేకుండా జాగ్రత్తపడాలి. తర్వాత ఎడమ చేతిని తలమీదుగా కుడికాలికి సమాంతరంగా ఉండేలా పైకెత్తాలి. ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా ఎడమ చేతి బొటన వేలిని చూసే విధంగా తలను నెమ్మదిగా పైకి తిప్పాలి.
ఈ ఆసనంలో 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకొని వదులుతుండాలి. తర్వాత ఎడమ వైపు కూడా ఆసనం వేయాలి.
చేతులు నేలకు ఆనించలేకపోతే, కాలి దగ్గర ఇటుక లాంటిది పెట్టి, దానిపై ఉంచాలి.
పార్శకోణాసనం వల్ల ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తుంటి నొప్పులు దూరమవుతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారు తల తిరుగుతున్నట్లు అనిపించినా ఈ ఆసనం ప్రయత్నించకూడదు.
పొట్టలో అసౌకర్యంగా ఉన్నా, వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా వెంటనే ఆపేయాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

