పంద్రాగస్టు అంటే ఫ్యాషన్‌లోనూ దేశభక్తి రంగులు మెరిసిపోతాయి. అయితే ప్రతిసారీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ కలిపి వేసుకోవడమే కాకుండా.. ఈసారి త్రివర్ణాన్ని కాస్త ైస్టెలిష్‌గా ప్రయత్నించొచ్చు. మూడు రంగులనూ ఒకేసారి ధరించాల్సిన అవసరం లేకుండా, ఒకో రంగును మీ లుక్‌లో ప్రత్యేకంగా హైలైట్ చేయొచ్చు.
తెల్లటి కుర్తాకు ఆరెంజ్ లేదా గ్రీన్ దుపట్టా జత చేస్తే సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది. చీరతో ప్రయోగాలు చేయాలనుకునేవారు ఆఫ్-వైట్ లేదా ఐవరీ చీరకు త్రివర్ణ అంచు ఉపకప బోర్డర్‌ను ఎంచుకోవచ్చు. పూర్తిగా మువ్వన్నెల ప్రింట్ ఉన్న దుస్తుల కంటే ఈ తరహా మినిమల్ డీటెయిలింగ్ మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది. యువత కోసం త్రివర్ణ యాక్సెసరీలు మరో మంచి ఆప్షన్. పచ్చ బ్యాగ్, కాషాయం సార్ఫ్, తెలుపు షూస్.. ఇలా మూడు రంగులను విడివిడిగా లుక్ లోకి తీసుకురావచ్చు.
ఆఫీసుల్లో ఫార్మల్ లుక్ కావాలంటే తెల్లటి షర్ట్ తో గ్రీన్ ట్రౌజర్ లేదా ఆరెంజ్ యాక్సెంట్ యాక్సెసరీ చాలు. మేకప్ లోనూ మరీ స్పష్టమైన మూడు రంగుల ప్రయోగాలు అవసరం లేదు. ఆకుపచ్చ ఐలైనర్ లేదా ఆరెంజ్ టోన్ లిప్ స్టిక్‌తో చిన్నపాటి కలర్ యాక్సెంట్ ఇస్తే సరిపోతుంది. అంటే.. దేశభక్తి మన ైస్టెల్లో సున్నితంగా కనిపించేలా చేస్తే చాలు ఈ ఇండిపెండెన్స్ డే ఫ్యాషన్ మరింత ట్రెండీగా మారిపోతుంది.