నేనేం కూర్చొని తినలేదు
ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పుడు హీరోయిన్లు తమ శరీర సౌష్టవంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పెళ్లి-పిల్లల వరకు వచ్చేసరికి శరీరాకృతిని అంతగా పట్టించుకోరు. ముఖ్యంగా, గర్భధారణ-ప్రసవం తర్వాత ఎక్కువగా బరువు పెరుగుతారు. ఈ క్రమంలో కొందరు బాడీ షేమింగ్‌కు గురవుతారు.
ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పుడు హీరోయిన్లు తమ శరీర సౌష్టవంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పెళ్లి-పిల్లల వరకు వచ్చేసరికి శరీరాకృతిని అంతగా పట్టించుకోరు. ముఖ్యంగా, గర్భధారణ-ప్రసవం తర్వాత ఎక్కువగా బరువు పెరుగుతారు. ఈ క్రమంలో కొందరు బాడీ షేమింగ్‌కు గురవుతారు. గతంలో నేహా ధూపియా, దీపికా పదుకోన్, ఆలియా భట్ వంటి తారలు.. ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నవారే! ప్రసవం తర్వాత తమపై వచ్చిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై గళం విప్పారు కూడా. తాజాగా, తనను బాడీ షేమింగ్ చేసిన ఫొటోగ్రాఫర్ల తీరుపై మండిపడ్డది బాలీవుడ్ నటి, నిర్మాత పత్రలేఖ. ఇటీవల తన భర్త రాజ్‌కుమార్ రావుతో కలిసి ఒక ఈవెంట్‌కు హాజరైంది పత్రలేఖ.
అయితే, ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ఈవెంట్లో కాస్త బొద్దుగా కనిపించింది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈమెకు ఏమైంది?’ అనే క్యాప్షన్ ఇచ్చింది. తాను ఎక్కువ బరువు పెరిగినట్లు ఉద్దేశిస్తూ చేసిన ఆ వ్యాఖ్యలపై పత్రలేఖ స్పందిస్తూ.. తన ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ‘నాకేమైంది అని అడుగుతారా? నేను ఇప్పుడే తల్లయ్యాను’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘అవును నిజమే! నేను బరువు పెరిగాను. ఇది మీ అందరికీ ఏదో వింతైన విషయంగా అనిపిస్తున్నట్లు ఉంది. అయితే, నేనేమీ కూర్చుని తినడం వల్ల బరువు పెరగలేదు. గర్భధారణ సమయంలో నా శరీరం స్పందించిన తీరు ఇది’ అంటూ రాసుకొచ్చింది.
ఇక తాను బిడ్డకు జన్మనివ్వడంతోపాటు అదే సమయంలో రెండు సినిమాలు కూడా నిర్మించినట్లు చెప్పుకొచ్చింది. ఇవి ఎంతో కష్టమైన పనులనీ, దయచేసి మనుషుల పట్ల కొంచెం దయగా ఉండటం నేర్చుకోవాలంటూ హితవు పలికింది. పత్రలేఖ చేసిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచీ మంచి స్పందన వస్తున్నది. ఆమెకు మద్ధతుగా పలువురు కామెంట్లు కూడా పెడుతున్నారు. మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన పత్రలేఖ.. 2014లో వచ్చిన ‘సిటీ లైట్స్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. అదే సినిమాలో కో-స్టార్ అయిన రాజ్‌కుమార్ రావుతో మొదలైన స్నేహం.. ప్రేమగా మారింది. సుదీర్ఘకాలం ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2021లో
వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఆనందదాయకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Manifesto | నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల భృతి, రైతులకు రుణమాఫీ.. అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

