ప్రస్తుతం భారతీయ వంటకాల్లో ఓట్స్ ఒక అంతర్భాగంగా మారిపోయాయి. ఇన్స్టంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ ఇలా రకరకాల పేర్లతో మార్కెట్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ ఓట్స్ తినడం సురక్షితమే కాదు, ఎంతో ప్రయోజనకరం కూడా! ఓట్స్‌లో పీచు పదార్థం ఎకువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల ఆహారం తీసుకోవడం నియంత్రణలో ఉంటుంది. తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఓట్స్ది కీలక పాత్ర. డయాబెటిస్ ఉన్నవారు పరిమిత పరిమాణంలో ప్లెయిన్ ఓట్స్ తీసుకోవడం మంచిది. వీటిలో ైగ్లెసెమిక్ లోడ్ తకువగా ఉంటుంది. అయితే, కేవలం ఓట్స్ మాత్రమే కాకుండా, వాటితో పాటు కొంచెం ప్రొటీన్ (గుడ్లు లేదా పప్పులు వంటివి) కలిపి తీసుకుంటే చకెర స్థాయులు అదుపులో ఉంటాయి. అన్నం కంటే ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ చాలా ఎకువ. ఇది మిమ్మల్ని ఎకువ సేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. అయితే, డైట్లో ఒకసారిగా ఓట్స్‌ను చేర్చుకుంటే కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని క్రమంగా అలవాటు చేసుకోవాలి.