no shave november | నో షేవ్ నవంబర్ స్టైల్ కోసమా? ఇంకా ఏదైనా కారణమా?
no shave november | చంటిగాడిది పిల్లి గడ్డం. యాదేశ్ అన్నది ఫ్రెంచ్ గడ్డం. వెంకీసార్ది ఫంకీ గడ్డం. పుర్రెకో బుద్ధి. జిహ్వకో రుచి. మనిషికో గడ్డం. కానీ, ఈ నెలకు సంబంధించినంత వరకూ కొన్ని గుబురు గడ్డాల వెనుక గుండెల్ని తడిమే కథ ఉంటుంది. జీవితాల్ని నిలబెట్టే చిరు సాయమూ ఉంటుంది. ‘నో షేవ్ నవంబర్’ గురించి మీరెప్పుడైనా విన్నారా?

నిజమే, నవంబరులో చాలా మంది గడ్డాలతో దర్శనమిస్తున్నారు. రాజీ పడకుండా, ‘నో షేవ్’ థీమ్‌ను పాటిస్తున్నారు. ఇదేదో స్టైల్ కావచ్చని అనుకుంటే పొరపాటే. గడ్డం వెనుక సదుద్దేశమే ఉంది. సామాజిక బాధ్యతా కనిపిస్తున్నది. నెలంతా షేవింగ్, ట్రిమ్మింగ్ జోలికి వెళ్లకుండా… అలా పోగైన డబ్బును క్యాన్సర్ రోగులకు అందిస్తారు. ఆస్ట్రేలియాలో మొదలైన ‘నో షేవ్ నవంబర్’ థీమ్ ప్రపంచమంతా విస్తరించింది. అసలే, సున్నిత హృదయులైన హైదరాబాదీ యువతనూ ఆకట్టుకుంటున్నది. సోషల్ మీడియాలోనూ ‘నో షేవ్ నవంబర్’ హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతున్నది. తమ గుబురు గడ్డం సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఈ కాన్సెప్ట్‌ను నలుగురికీ చేరవేస్తున్నారు. నవంబరు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న కొందరు గడ్డం యోధుల అభిప్రాయాలు..

సామాజిక బాధ్యతగా
మా సెలూన్‌కు చాలా మంది నో షేవ్ వీరులు వస్తారు. కటింగ్ మాత్రమే చేయించుకుంటారు. గడ్డం జోలికి వెళ్లరు. ఆ డబ్బును క్యాన్సర్ ఫౌండేషన్స్‌కు అందిస్తారు. వాళ్ల పట్టుదలను అభినందించాల్సిందే. కొన్నిసార్లు గడ్డం చేసినా నేను డబ్బు తీసుకోను. ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించమని చెబుతాను.
– కొమరవెల్లి నరేశ్, సెలూన్ యజమాని
క్యాన్సర్ రోగులకు చేయూత
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు క్యాన్సర్ బారినపడుతున్నారు. ప్రతి ఏడాది దేశంలో పది లక్షల మందికి క్యాన్సర్ నిర్ధారణ అవుతున్నది. అందులో, పదివేల మంది హైదరాబాదీలే. వారి కోసం మనవంతుగా ఏదైనా సాయం చేయాలని అనిపించింది. ‘నో షేవ్’ థీమ్‌ను పాటించి, అలా ఆదా చేసిన డబ్బును ఇస్తున్నా. మా స్నేహితులు కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి సోషల్ థీమ్స్ మరిన్ని రావాల్సి ఉంది.
– ప్రదీప్, ఐటీ ఉద్యోగి
ఏటా ఇదో నియమం
గత రెండేండ్లుగా నో షేవ్ నవంబర్ థీమ్‌ను కచ్చితంగా పాటిస్తున్నాను. నెలంతా సాధారణంగా నాకు గడ్డం మీద రెండు వేల వరకు ఖర్చు వస్తుంది. మా సంస్థ తరఫున పనిచేసే వలంటీర్లు కూడా నవంబర్‌లో షేవింగ్ చేసుకోరు. ఆ రూపంలో ఆదా చేసిన డబ్బును ఫౌండేషన్లకు ఇస్తుంటాం. మా సంస్థ ద్వారా ప్రతి నెలా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. ఈ మాసం ‘నో షేవ్ నవంబర్’ను అమలుచేస్తున్నాం.
– భార్గవ్, హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్
ఇడుమాల కిరణ్ కుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళన చేశారు.. కానీ..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

