గోళ్ల శుభ్రతే ఆరోగ్యం
ఆరోగ్యంపట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చిన్న చిన్న తప్పులు పెను ముప్పులకు దారితీస్తాయి. ముఖ్యంగా చాలామంది గోళ్ల విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు. ఈ కారణంగా రకరకాల రుగ్మతలు పలకరిస్తాయి. మనదేశంలో అందరం చేత్తో భోజనం చేస్తాం కాబట్టి గోళ్లు శుభ్రం చేసుకోవడం అత్యంత అవసరం.
ఆరోగ్యంపట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చిన్న చిన్న తప్పులు పెను ముప్పులకు దారితీస్తాయి. ముఖ్యంగా చాలామంది గోళ్ల విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు. ఈ కారణంగా రకరకాల రుగ్మతలు పలకరిస్తాయి. మనదేశంలో అందరం చేత్తో భోజనం చేస్తాం కాబట్టి గోళ్లు శుభ్రం చేసుకోవడం అత్యంత అవసరం. లేదంటే రకరకాల బ్యాక్టీరియా పెరిగేందుకు గోళ్లే స్థావరంగా మారిపోతాయి. భోజనం తినే ముందు, తిన్న తర్వాత చేతులతో పాటు గోళ్ల సందులను కూడా శుభ్రంగా కడుక్కోవాలి.
అంతేకాదు, వివిధ రసాయనాలతో తయారు చేసిన డిష్వాషర్లతో అంట్లు తోమినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి గోళ్లలోకి వెళ్లి తద్వారా భోజన సమయంలో నోట్లోకి చేరే అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండేందుకు, గోళ్లను పొడవుగా పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. కొంతమందికి గోళ్లు కొరికే అలవాటూ ఉంటుంది. దాన్ని ముందు మానేసి, గోళ్ల అపరిశుభ్రత ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుని పిల్లలకూ చెప్పాలి. చేతులు శుభ్రం చేసుకున్న ప్రతిసారీ గోళ్లను జాగ్రత్తగా కడుక్కుంటే వ్యాధికారకాలను చాలావరకు నివారించొచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

