కన్నీటి కత.. నీనా ఆత్మకథ!

లాక్డౌన్లో బాలీవుడ్ నటి నీనాగుప్తా తన ఆత్మకథను పూర్తి చేశారు. పుస్తకంగా విడుదల చేశారు. ఆమె కథను చదివితే కన్నీళ్లు ఉబికి వస్తాయి. బాలీవుడ్ హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టి, పెండ్లికి ముందే తల్లి అయి, సింగిల్ పేరెంట్‌గా తన బిడ్డను పెంచి, ప్రయోజకురాలిని చేసిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
‘నిజం చెప్పాలంటే..’ అంటూ తన ఆత్మకథను మెదలుపెట్టిన అలనాటి అందాలతార నీనాగుప్తా తన జీవితంలోని ఎత్తు పల్లాలను, భావోద్వేగాలను, నిద్రలేని రాత్రులను నిర్భయంగా పాఠకుల ముందుంచారు. తెరమీద అందంగా వెలిగిన ఈ తార, నిజ జీవితంలో అంధకారాన్ని చవిచూశారు. మూడు దశాబ్దాల క్రితమే సింగిల్ మదర్‌గా మారారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రిచర్డ్స్‌తో సహజీవనం మధ్యలోనే విచ్ఛిన్నమైంది. గర్భవతిగా ఉన్నప్పుడే అతడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత మసాబాకు జన్మనిచ్చారు. మసాబా బాలీవుడ్ హీరోయిన్గా, ఫ్యాషన్ డిజైనర్ పేరు తెచ్చుకున్నారు. మసాబా డెలివరీ సమయంలో నీనా దగ్గర 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ కష్టాలనుంచి గట్టెక్కేందుకు నార్మల్ డెలివరీ అవ్వాలని దేవుడిని కోరుకున్నారట. ఫిల్మ్ స్కూల్ స్నేహితుడు సతీశ్ కౌశిక్, నీనా గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెను పెండ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడట. అంత పెద్ద విషయాన్ని కూడా చాలా సున్నితంగా తిరస్కరించినట్లు తన ఆత్మకథలో వివరించారామె. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన అకౌంటెంట్ వివేక్ మెహ్రాను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అమితాబ్, రష్మిక ప్రధానపాత్రల్లో నటిస్తున్న ‘గుడ్ బై’ అనే సినిమాలో నటిస్తున్నారు నీనా. ఆమె తాజాచిత్రం ‘సర్దార్ కా గ్రాండ్సన్’ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. మంచి ప్రేక్షకాదరణ పొందింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

