మధుమేహ రోగులు పాలకూర, మెంతికూర తింటే మంచిదని అంటారు. ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకాలు, సూక్ష్మ మూలకాలు తోటకూరలోనూ అపారం.
కొలెస్ట్రాల్ కరుగుతుంది
తోటకూరలోని ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. తోటకూరలో లభించే విటమిన్-ఇలోని ఒక రకమైన టొకోట్రైనాల్స్కు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది.
డయాబెటిస్‌కు..
తోటకూర యాంటీ హైపర్ గ్లైసిమిక్ యాక్టివిటీని ప్రదర్శిస్తుంది. దీనివల్ల టైప్- 2 డయాబెటిస్ రోగుల్లో చక్కెర నియంత్రణలోకి వస్తుంది. ఇక తోటకూరలోని ప్రొటీన్ రక్తంలో ఉన్న ఇన్సులిన్‌ను అడ్డుకుంటుంది. పైగా వీటిలోని ఒక హార్మోన్ ఆకలిని తగ్గించి ఊబకాయాన్ని నివారిస్తుంది.
క్యాల్షియం లోపం
ఎముకల ఆరోగ్యంలో క్యాల్షియందే కీలకపాత్ర. తోటకూరలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలా ఎముకల ఆరోగ్యానికి సాయపడుతుంది. ఎముకలు గుల్లబారడాన్నీ (ఆస్టియోపొరోసిస్) అడ్డుకుంటుంది.
క్యాన్సర్ నుంచి రక్షణ
విటమిన్-ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్-సితోపాటు లైసీన్ కూడా ఉండటంతో హానికరమైన కణాల పెరుగుదలకు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాటానికి తోటకూర సాయపడుతుంది. అలా క్యాన్సర్‌పై పోరాటంలోనూ సహకరిస్తుంది.