బాధ్యత తెలియని భర్తతో..
నా వయసు నలభై. మావారు ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి హోదాలో ఉండేవారు. రెండేండ్ల క్రితం తన సహోద్యోగులతో కలిసి సొంతంగా ఎగుమతి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం మానేస్తానని పట్టుబట్టారు. ‘మంచి కొలువు. ఎదిగిన ఇద్దరు కూతుళ్లున్నారు. అంత రిస్క్ తీసుకోవద్దు. ఇప్పటికే మామయ్య వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. అంతా మీ సంపాదనపైనే ఆధారపడి బతుకుతున్నాం’ అని వారించాను. అయినా నా మాట లెక్కచేయలేదు. ఉన్న సొమ్మంతా పోసి.. బిజినెస్లో దిగారు. మూడు నెలల్లోనే నష్టాలొచ్చాయి
నా వయసు నలభై. మావారు ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి హోదాలో ఉండేవారు. రెండేండ్ల క్రితం తన సహోద్యోగులతో కలిసి సొంతంగా ఎగుమతి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం మానేస్తానని పట్టుబట్టారు. ‘మంచి కొలువు. ఎదిగిన ఇద్దరు కూతుళ్లున్నారు. అంత రిస్క్ తీసుకోవద్దు. ఇప్పటికే మామయ్య వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. అంతా మీ సంపాదనపైనే ఆధారపడి బతుకుతున్నాం’ అని వారించాను. అయినా నా మాట లెక్కచేయలేదు. ఉన్న సొమ్మంతా పోసి.. బిజినెస్లో దిగారు. మూడు నెలల్లోనే నష్టాలొచ్చాయి. మేమంతా రోడ్డునపడ్డాం. మళ్లీ పాత సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. జీతం తక్కువైనా సరే, అక్కడే చేరతానని అంటున్నారు. ఆ బాధ్యత తెలియని మనిషిని చూస్తేనే.. ఒళ్లు మండిపోతుంది. కానీ, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. నోరెత్తలేకపోతున్నా. అతను నా మీద కసి, కోపం పెంచుకున్నాడు. ఎందుకిలా జరుగుతున్నది?
– ఓ సోదరి
మీ మనసులోని భావాలను చక్కగా రాశారు. అతను బిజినెస్ చేస్తానన్నప్పుడు మీరు అండగా నిలబడలేదు. అడ్డు చెప్పారు. అందుకే మీ విషయంలో కోపంగా ఉన్నాడేమో. పైగా తను ఇబ్బందుల్ల్లో ఉన్నప్పుడూ కించిత్ కూడా సానుభూతి చూపలేదు. జీవిత భాగస్వామిగా కీలక సమయాల్లో మీరు తోడుగా లేరనే బాధ అతడిని వెంటాడుతూ ఉండవచ్చు. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒకటే. మీ భర్తతో మనసువిప్పి మాట్లాడటం. ఏం ఫర్వాలేదు, మనకూ మంచి రోజులొస్తాయని ఓదార్పునివ్వడం. మీ భవిష్యత్, పిల్లల భవిష్యత్ గురించి వివరంగా చెప్పడం. ఇద్దరూ కలిసి ఓ సముచితమైన నిర్ణయం తీసుకోవడం. సీనియారిటీని కూడా వదులుకొని, తక్కువ జీతానికి ఉద్యోగానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడంటే.. అది మీకోసం, మీ కుటుంబం కోసమే కదా! ఆ విషయాన్ని మీరు గుర్తించాలి.
మీ మధ్య ఏర్పడిన అగాథాన్ని పూడ్చుకోవడానికి ఇదే సరైన సమయం. అతను ఆర్థికంగా స్థిరపడే వరకూ అన్నివిధాలా తోడుగా నిలబడండి. అవకాశం ఉంటే ఏదైనా ఉద్యోగంలో చేరండి. పిల్లల్ని బాగా చదివించండి. అతను తప్పకుండా మిమ్మల్ని అర్థంచేసుకుంటాడు. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అంతమాత్రాన ఎదుటి వ్యక్తిని అసమర్థుడి కింద జమకట్టలేం. వైవాహిక జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఒకానొక చేదు అనుభవం కారణంగా కఠిన నిర్ణయం తీసుకోవడం సరికాదు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

