Mangli | జానపద గీతాలతో ప్రాచుర్యంలోకి వచ్చిన మంగ్లీ అందరికీ సుపరిచితురాలే! సినిమా పాటలతోనూ తన సత్తా చాటిన ఈ లోకల్ స్టార్.. గ్లోబల్ వేదికపైనా తన మధురిమలు వినిపించి అదరహో అనిపించింది. ఇటీవల బెంగళూరుకు చెందిన స్వధా ఫౌండేషన్ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్లో ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ లాంటి లబ్ధప్రతిష్ఠులైన గాయకులతో కలిసి వేదిక పంచుకుంది.
సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న సత్యవతీ చౌహాన్ అలియాస్ మంగ్లీ ఆడబిడ్డలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.