Tims Magazine | ‘ప్రతి మనిషి జీవితంలోనూ మధురమైన జ్ఞాపకాలెన్నో ఉంటాయి. వాటన్నిటికీ ఓ పత్రిక రూపం ఇస్తే.. అదే, టిమ్స్ మ్యాగజైన్. ఇదేమంత కష్టమైన పని కాదు. ఆ పత్రిక సంపాదక బృందాన్ని సంప్రదిస్తే చాలు. మన జీవిత ప్రస్థానానికి అక్షర రూపమిచ్చి, అందమైన ఫొటోలు జోడించి.. అద్భుతమైన మ్యాగజైన్‌గా రూపొందిస్తారు. దీన్ని బంధుమిత్రులకు కానుకగా ఇవ్వొచ్చు.
గుజరాత్‌కు చెందిన హృతుల్ పటేల్, దేవాన్షి దంపతుల ఆలోచన ఇది. ఈ జంట తమ స్నేహితురాలి పుట్టినరోజు కోసం తొలిసారిగా ఓ మ్యాగజైన్ డిజైన్ చేశారు. దానికి అనూహ్యమైన స్పందన రావడంతో.. పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చుకున్నారు. పెండ్లిరోజు, పుట్టినరోజు, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, బారసాల, ప్రెగ్నెన్సీ ఫొటోషూట్.. సందర్భం ఏదైనా మ్యాగజైన్ తయారుచేసి ఇస్తామని అంటున్నారు పటేల్, దేవాన్షి. వీరికి timsmagazines.com పేరుతో వెబ్సైట్ కూడా ఉంది.
“ఆకాశంలోనే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, థియేటర్లు.. మీకు వెళ్లాలని ఉందా”