వారిద్దరి దోస్తానాకు ఇరవై ఏండ్లు. వైవాహిక బంధానికి పదహారేండ్లు. ‘వంశీ’ సినిమా సెట్స్‌లో ఏ ముహూర్తాన చూపులు కలిశాయో గానీ, ఇప్పటికీ ఇద్దరూ మంచి దోస్తులే, ఆదర్శ దంపతులే. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతున్న మహేశ్ బాబు.. ఓ ఇల్లాలికి మంచి భర్త. ఇండస్ట్రీలో స్టార్ అవుదామనుకున్న నమ్రత… మహేశ్ కు తగ్గ ఇల్లాలు. ఆ ఇద్దరి బంధాల ముచ్చట్లు..
బాలనటుడిగానూ కొన్ని సినిమాలు చేశాను. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. మంచి సినిమాలు చేశానన్న తృప్తి ఉంది. ప్రతి సినిమాకూ ప్రేక్షకుల అంచనాలు పెరుగుతుంటాయి. వాటిని అందుకోవడం సవాలే!
కథ పూర్తిగా విని, స్క్రిప్ట్ నచ్చిన తర్వాతే సెట్స్ మీదికి వెళ్తాం. కానీ, కొన్ని సందర్భాల్లో సినిమా మనం అనుకున్నంత సక్సెస్ కాలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనసుకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ‘స్పైడర్’ లాంటి ప్రయోగాత్మక సినిమాలు విజయవంతం కాకపోవచ్చు. ఈ మధ్య కాలంలో అలాంటివి ఎదురవలేదు. అయినా గతాన్ని తలుచుకుంటూ ఆగిపోకూడదు. నన్ను నమ్మి దాదాపు రూ.200 కోట్లతో వ్యాపారం చేస్తారు. నేను తీసుకునే నిర్ణయం సరిగ్గా లేకపోతే, నిర్మాతలతోపాటు చాలామంది జీవితాలు రిస్క్‌లో పడ్డట్టే! అందుకే సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.
నేను చేస్తున్న పనిలో ఒత్తిడి సహజం. మొదట్లో చాలా కోపానికి గురయ్యేవాణ్ని. కానీ, మనం ఎంత కూల్‌గా ఉంటే, చేస్తున్న పని కూడా అంత సజావుగా సాగిపోతుందని మెల్లగా అర్థమైంది. ఇప్పటికైతే చాలా కామ్‌గా ఉంటున్నా!
నేను ఇంటి బయటకు వెళ్తేనే హీరోని. ఇంట్లో ఉన్నంత వరకు నా భార్యకు మంచి భర్తగా, నా పిల్లలకు మంచి తండ్రిగా ఉండాలనుకుంటా. మా ఆవిడ నన్ను ప్రత్యేకంగా చూడదు. అందరు పిల్లలూ వాళ్ల నాన్నతో ఎలా ఉంటారో.. నా పిల్లలూ నాతో అలాగే ఉంటారు. స్టార్, ఇమేజ్ ఇవన్నీ కాంపౌండ్ అవతలే!
‘వంశీ’ సినిమా గురించి పెద్దగా చెప్పలేను కానీ, ఆ చిత్రంతో జరిగిన మంచి పని మేమిద్దరం ఒక్కటవడం.
‘వంశీ’ సినిమా షూటింగ్లో మేం ఒకరినొకరు కలుసుకున్నాం. ఆ సినిమా సెట్స్‌లోనే స్నేహితులమయ్యాం. నేను తనను చూసేవాణ్ని. తనూ నన్ను చూసేది. చూపులతోనే మాట్లాడుకున్నాం. కొన్నాళ్లకు ప్రేమించుకున్నాం. మా ప్రేమాయణం ఐదేండ్లు కొనసాగిన తర్వాత 2005లో జంట అయ్యాం.
మహేశ్‌ను మొదటిసారి కలిసినప్పుడు చాలా కూల్‌గా అనిపించాడు! అమాయకత్వం, మంచితనం కలగలసిన వ్యక్తిత్వమని అర్థమైంది. కొన్నాళ్ల ప్రయాణం తర్వాత మంచి స్నేహితులం అయ్యాం. మేమిద్దరం కలవడం అన్నది రాసిపెట్టి ఉందనుకుంటా! కుటుంబ విలువలు తనకు చాలా ముఖ్యం. దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పష్టతా ఉంటుంది.
పెండ్లయ్యాక తెలుగు నేర్చుకోవడం పెద్దటాస్క్ అయింది. భాష నేర్చుకోవాలని ప్రణాళికలేం వేసుకోలేదు కానీ, అది అవసరమేమో అనిపించింది. కొన్నాళ్లకు ప్రత్యేకంగా
ట్యూటర్‌ను పెట్టుకొని నేర్చుకునే ప్రయత్నం చేశా. నా వల్ల కాలేదు. నా ఇబ్బంది గమనించిన మహేశ్ ఇలా లాభం లేదన్నాడు. ఇంట్లో స్టాఫ్‌తో మాట్లాడుతూ ఉంటే అదే వస్తుందని సలహా ఇచ్చాడు.
పిల్లలను మహేశ్ చాలా గారాబం చేస్తాడు. నేను మాత్రం కొంచెం కఠినంగానే ఉంటాను. వాళ్లు విలాసాలకు అలవాటుపడితే ఎలా? అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. విమాన ప్రయాణంలో ఎకానమీ క్లాస్‌లోనే తీసుకెళ్తాను. అన్ని రకాల పరిస్థితులను వాళ్లు అర్థం చేసుకోవాలి కదా!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Urmila Matondkar | బాలీవుడ్ నటి ఊర్మిళకు కరోనా పాజిటివ్..
Rajamouli | పవన్ కళ్యాణ్‌తో సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Puneeth Raj Kumar : పునీత్‌ను తలచుకుని ఎమోషన్ అయిన అల్లు అర్జున్
kaikala satyanarana : ఆసుపత్రిలో కైకాల సత్యనారాయణ .. ఆందోళనలో ఫ్యాన్స్