కరోనా లాంగ్ సైరన్
కొవిడ్ వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం చాలామందిని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. పోస్ట్ కొవిడ్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. 8 నుంచి 12 వారాలపాటు లాంగ్ కొవిడ్‌తో పోరాడి విజయం సాధించిన రోగుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకటికాదు, రెండుకాదు ఏకంగా 200 రకాల అనారోగ్య లక్షణాలు లాంగ్ కొవిడ్ బాధితుల్లో కనిపిస్తున్నట్లు ప్రపంచఆరోగ్య సంస్థ అంచనా వేస్తున్నది
కొవిడ్ వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం చాలామందిని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. పోస్ట్ కొవిడ్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. 8 నుంచి 12 వారాలపాటు లాంగ్ కొవిడ్‌తో పోరాడి విజయం సాధించిన రోగుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకటికాదు, రెండుకాదు ఏకంగా 200 రకాల అనారోగ్య లక్షణాలు లాంగ్ కొవిడ్ బాధితుల్లో కనిపిస్తున్నట్లు ప్రపంచఆరోగ్య సంస్థ అంచనా వేస్తున్నది. దీనిపై అనేక అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే, అసలు లాంగ్ కొవిడ్ బాధితులకు ఎదురవుతున్న సమస్యలు, పోస్ట్ కొవిడ్‌లో కనిపిస్తున్న అనారోగ్య ఇబ్బందుల గురించి కిమ్స్ దవాఖాన వైద్యనిపుణులు డాక్టర్ కె. శివరాజు ద్వారా తెలుసుకుందాం.
లాంగ్ కొవిడ్ బాధితుల్లో కొందరు బ్లాక్‌ఫంగస్ బారినపడుతున్నారు. మరికొందరిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు… ఇలా శరీరంలోని ప్రధాన అవయవాల పనితీరు దెబ్బతింటున్నది. కరోనా ప్రారంభంలో ఇది కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా భావించారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వైరస్ విశ్వరూపం బయటపడుతున్నది. కొవిడ్ నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలతో కొంతమంది మృత్యువాత పడుతున్నారు.
లాంగ్ కొవిడ్ అంటే…
సాధారణంగా కరోనా వైరస్ వారం నుంచి పదిరోజులు, తీవ్ర లక్షణాలు ఉంటే పదిహేను రోజులు ఉంటుంది. తర్వాత వైరస్ ప్రభావం క్రమంగా తగ్గిపోవాలి. అలాకాకుండా నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు కరోనా లక్షణాలు ఉంటే దానిని లాంగ్ కొవిడ్‌గా పరిగణిస్తారు. సాధారణంగా కరోనా పరిస్థితులను మూడు భాగాలుగా విభజించారు. మొదటిది కొవిడ్, రెండోది లాంగ్ కొవిడ్, మూడోది పోస్ట్ కొవిడ్. వైరస్ తీవ్రత రోగి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రోగి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ. కానీ, లాంగ్ కొవిడ్, పోస్ట్ కొవిడ్‌లో మాత్రం చాలామంది వివిధ రకాల సమస్యలకు గురవుతున్నారు. ఈ రెండు రకాల పరిస్థితుల్లో కూడా బాధితుల్లో దాదాపు 200 రకాల అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అంచనాకు వచ్చింది. అయితే దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. మరింత స్పష్టత రావాల్సి ఉన్నది.
కచ్చితమైన కారణాలు తెలియదు
పోస్ట్ కొవిడ్‌లో తీవ్ర లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం చూశాం. కానీ, లాంగ్ కొవిడ్ విషయంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కొన్ని వారాలపాటు వైరస్ బారినపడటానికి గల కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్న వారు, ఏ కారణం వల్ల లాంగ్ కొవిడ్‌కు గురవుతున్నారనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.
ముందుగా గుర్తిస్తే..
లాంగ్ కొవిడ్‌కు గురైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ, స్వల్ప లక్షణాలున్న వారు వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అంటే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారిలో లాంగ్ కొవిడ్ ప్రభావం అధికంగా ఉంటున్నది. లక్షణాలను ముందుగానే గుర్తించి, వైద్యుణ్ని సంప్రదిస్తే అపాయం నుంచి బయటపడొచ్చు.
లాంగ్ కొవిడ్ రోగుల్లో లక్షణాలు
- నీరసం
- దగ్గు
- ఛాతీ బరువుగా, పట్టేసినట్లు ఉండటం
- గుండె దడ
- ఆయాసం
- వెంట్రుకలు ఊడిపోవడం
- కాళ్లు లాగడం, నొప్పి
- కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం
- తరచూ డయేరియాకు గురవడం
- రోగనిరోధక వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తం కావడం
- గతంలో లేని వారికి షుగర్ వ్యాధి రావడం
- మెమరీ డిస్ట్రబెన్స్ (తీవ్రమైన మతిమరుపు రావడం)
- మానసిక స్థితి దెబ్బతినడం
- ఒత్తిడికి గురవడం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హైపర్ టెన్షన్, మధుమేహం, ఊబకాయం, గుండె, ఊపిరితిత్తులు తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ కొవిడ్‌కు గురైతే, అంటే నాలుగు నుంచి ఆరు వారాలు దాటినా కరోనా లక్షణాలు తగ్గకపోతే, వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి సూచన మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీరిలో సాధారణ రోగుల కంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- రీహాబిలిటేషన్ అంటే శ్వాస సంబంధిత వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ చేయాలి
- ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
- వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు చికిత్స తీసుకోవాలి
ఆందోళన వద్దు
చాలామందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. అలాంటి వారు భయపడాల్సిన అవసరం లేదు. తీవ్ర లక్షణాలు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యులను సంప్రదించి, సకాలంలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. అయితే లాంగ్ కొవిడ్‌కు సంబంధించిన పరిణామాలపై అధ్యయనాలు జరుగున్నాయి. పూర్తిస్థాయి స్పష్టత రావల్సి ఉంది.
మరణాలకు కారణం
లాంగ్ కొవిడ్ బాధితుల్లో సుమారు 10-20 శాతం మంది రోగులు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు, గుండె వైఫల్యం, పల్మనరీ ఎంబాలిజం(ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) వంటి సమస్యల వల్ల కూడా చాలామంది మరణిస్తున్నారు. మరికొంత మంది కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ కారణంగా కూడా కన్నుమూస్తున్నారని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది. హైపర్ టెన్షన్, షుగర్ తదితర వ్యాధిగ్రస్తులు, ధూమపానం, మద్యపానం చేసేవారు లాంగ్ కొవిడ్‌కు గురైనప్పుడు ఇలాంటి రిస్క్ అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
– డాక్టర్ కె.శివరాజు
సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
—✍ మహేశ్వర్‌రావు బండారి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

