Thiruveer | మసూద మూవీలో ఉన్న ఈ నటుడు ఇన్ని సినిమాల్లో నటించాడా?
Masooda Movie Actor Thiruveer | నాటకరంగ అనుభవంతో వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు పాలమూరు ముద్దుబిడ్డ తిరువీర్. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘మసూద’ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ‘జిందగీ’తో తిరువీర్ పంచుకున్న అనుభవాలు..
Masooda Movie Actor Thiruveer | పాలమూరు నుంచి బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన కుర్రాడు.. తండ్రిలా యంత్రాల్లో మగ్గిపోవాలని భావించలేదు. తనకు నచ్చిందే చేయాలనుకున్నాడు. రంగస్థలంపై మోజుతో అక్కడ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆటుపోట్లు, అవమానాలు.. అన్నిటినీ భరించాడు. కాలపరీక్షలో నెగ్గాడు. నటుడయ్యాడు, హీరోగా తొలి విజయాన్ని అందుకున్నాడు. నాలుగైదు సినిమాలకు కాల్షీట్లు ఇచ్చే రేంజ్‌కు చేరుకున్నాడు. నాటకరంగ అనుభవంతో వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు పాలమూరు ముద్దుబిడ్డ తిరువీర్. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘మసూద’ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ‘జిందగీ’తో తిరువీర్ పంచుకున్న అనుభవాలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మామిడిపల్లి మా సొంతూరు. మా కుటుంబం పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌కు వలసొచ్చింది. అమ్మానాన్న వీరమ్మ, వెంకట్‌రెడ్డి కాటేదాన్ పారిశ్రామిక వాడలో పనిచేసేవారు. నైట్‌డ్యూటీలు, ఓవర్ డ్యూటీలతో వాళ్ల జీవితాలు యంత్రాల మధ్య నలిగిపోయేవి. నా చదువు హైదరాబాద్‌లోనే సాగింది. వేసవి సెలవుల్లో నేనూ పనికి వెళ్లేవాణ్ని. ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాణ్ని.

బస్‌పాస్ కోసం ఎంఫిల్
సిటీ కాలేజీలో డిగ్రీ చేశాను. అక్కడ తరచూ సినిమా షూటింగ్‌లు జరుగుతుండేవి. అలా సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. డిగ్రీ తర్వాత తెలుగు యూనివర్సిటీలో ‘ఫైన్ ఆర్ట్స్’ కోర్సులో చేరాను. ఏదో ఉత్సాహం కొద్దీ చేరినా.. తర్వాత ఏం చేయాలో పాలుపోలేదు. థియేటర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 45 నాటకాల్లో నటించా. అయినా కెరీర్ ప్రశ్నార్థకంగానే ఉండేది! కొన్నాళ్లకు రెయిన్బో ఎఫ్ఎమ్లో ఆర్జేగా చేరాను. ఆ జీతం నా ఖర్చులకు సరిపోయేది. స్టూడెంట్ బస్‌పాస్ కోసం ఎంఫిల్‌లో చేరాను! కొన్నాళ్లు ఒక పాఠశాలలో థియేటర్ టీచర్‌గా పనిచేశాను.
మళ్లీ మొదటికి..
నేను నాటకాలు వేయడం చూసి ఇంట్లో తిట్టారు. అమ్మ మాత్రం ప్రోత్సహించింది. ఓ దశలో ఆమెకూ ఓపిక నశించింది. ‘నెలకు ఐదువేలిచ్చి… ఎన్ని కథలైనా పడు’ అన్నది. అయితే నేను నమ్ముకున్న నాటకాలే నాకు అవకాశాలు కల్పించాయి. డైరెక్టర్ ఖాజాపాషా ‘డాటర్ ఆఫ్ వర్మ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. తర్వాత కొన్నేండ్లకు
‘బొమ్మల రామవరం’ సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. అది సరిగ్గా ఆడలేదు. రానా ‘ఘాజీ’లో ఎక్కడో మూలన కనిపించాను. దీంతో నా జీవితం మళ్లీ మొదటి
కొచ్చిందా అనిపించింది. అదే సమయంలో ‘జీ తెలుగు’ వాళ్లు ‘డ్రామా జూనియర్స్’ ప్రారంభించారు. పిల్లల స్కిట్స్‌కు గురువుగా, మెంటర్‌గా అవకాశం కల్పించారు. ఆ షో సక్సెస్ కావడంతో రూ.15వేలకు పైగా ఆదాయం రావడం మొదలైంది. ఒకవైపు మెంటర్‌గా చేస్తూనే.. సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చేవాణ్ని.

నా కండ్లలో కోపం..
దర్శకుడు జీవన్‌కుమార్ ఓ సినిమా తీస్తున్నారని గీత రచయిత శ్రేష్ఠ ద్వారా తెలిసింది. ఆయనకు రెగ్యులర్‌గా మెసేజ్‌లు చేసేవాణ్ని. ఒకరకంగా చెప్పాలంటే విసిగించాను. ఒకరోజు నా వాట్సాప్ డీపీ చూసి కాల్ చేశారు. ‘అందులో ఉన్నది ఎవరు?’ అని అడిగారు. ‘నేనే’ అన్నారు. మర్నాడు ఆఫీస్‌కు రమ్మన్నారు. నా కండ్లలో నాకే తెలియని కోపం, క్రూరత్వం ఆయనకు కనిపించాయట. తను తీయబోయే ‘జార్జిరెడ్డి’లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విడుదలైన తర్వాత అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. తర్వాత ‘దావత్’ నాటికను రచించి, దర్శకత్వం వహించాను. దర్శకుడు కరుణకుమార్ దాన్ని చూసి ‘పలాస’ సినిమాలో అవకాశం ఇచ్చారు. వెంటనే ‘సిన్’ అనే వెబ్‌సిరీస్‌లో నటించా.
‘మల్లేశం’ సినిమాలో వీరప్రతాప్ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత నాలుగైదు నెలల నిడివిలో మెట్రో కథలు వెబ్‌సిరీస్‌తోపాటు శుభలేఖ+లు, టక్ జగదీష్ సినిమాల్లో నా పేరు స్క్రీన్‌పై కనిపించింది. నేను హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మసూద’ తాజాగా విడుదలైంది. సినిమా హిట్ కావడంతో నాకూ మంచి పేరొచ్చింది. నేను హీరోగా నటించిన నాలుగైదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నా ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు. కేవలం హీరో పాత్ర చేయాలనే నిబంధనేమీ పెట్టుకోలేదు. నటనకు అవకాశం ఉన్న ఏ పాత్ర చేసేందుకైనా సిద్ధం. ఓ నటుడిగా నా దృష్టిలో సినిమా అంటే.. ఎవుసం చేయడమే. రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు. రైతు పైరును కాపాడుకున్నట్టు, నటుడు కెరీర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి.
… రవికుమార్ తోటపల్లి
Read More :
సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు మదన్ కన్నుమూత
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


