OTT | ఓటీటీ హిట్ : డబుల్ ట్రబుల్
‘ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్‌ల తర్వాత మనోజ్ బాజ్‌పాయ్ ఏ పాత్ర పోషించినా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా.. ఆయన మంచి కథనే ఎంచుకుంటారనీ, తన పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడని ఎదురుచూస్తున్నారు. ఇక, మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.
కిల్లర్ సూప్
నెట్‌ఫ్లిక్స్: జనవరి 11
నటీనటులు: మనోజ్ బాజ్‌పాయ్, కొంకణాసేన్ శర్మ, నాజర్, సయాజీ శిండే తదితరులు
దర్శకత్వం: అభిషేక్ చౌబే
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌ల తర్వాత మనోజ్ బాజ్‌పాయ్ ఏ పాత్ర పోషించినా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా.. ఆయన మంచి కథనే ఎంచుకుంటారనీ, తన పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడని ఎదురుచూస్తున్నారు. ఇక, మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ‘కిల్లర్ సూప్’ మీద అంచనాలు భారీగా పెరగడానికి మనోజ్ డబుల్ రోల్ చేయడమే ప్రధాన కారణం. కథలోకి వెళ్తే… ప్రభాకర్ శెట్టి అలియాస్ ప్రభు (మనోజ్ బాజ్‌పాయ్), స్వాతి (కొంకణాసేన్ శర్మ) దంపతులు. ఇద్దరి అభిప్రాయాల మధ్య కొండంత దూరం ఉంటుంది.
స్వాతి సొంతంగా రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటుంది. ప్రభు పక్కా అవినీతి పరుడు. వ్యాపారవేత్తగా ఎదగాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంటూ ఉంటాడు. ప్రభు తన అన్న అరవింద శెట్టి (సయాజీ శిండే)తో కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తాడు. అవన్నీ బెడిసికొట్టడంతో నష్టపోతాడు. ఇక లాభం లేదనుకొని అన్న సాయంతోనే ఓ రిసార్టు ప్రారంభించాలని భావిస్తాడు. కానీ, అదీ వర్కవుట్ కాదు. మరోవైపు ఓ మసాజ్ చేసే వ్యక్తి ఉమేశ్ అచ్చం ప్రభులాగే ఉంటాడు. తరచూ ప్రభుకు మసాజ్ చేస్తుంటాడు.
అతనితో స్వాతికి అనుబంధం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో ప్రభు హత్యకు గురవుతాడు. ఇదే అదనుగా ప్రభు స్థానంలోకి ఉమేశ్‌ను తీసుకొస్తుంది స్వాతి. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ప్రభును చంపిందెవరు? ఆ హత్యకు స్వాతికి ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది మిగిలిన కథ. శృంగార సన్నివేశాలు మోతాదులోనే ఉన్నప్పటికీ.. అసభ్య సంభాషణలు చికాకు పుట్టిస్తాయి. కుటుంబ సమేతంగా చూడటం కష్టమే! మొత్తంగా మనోజ్ బాజ్‌పాయ్ నటన ఈ కామెడీ థ్రిల్లర్‌ను ప్రేక్షకులు చూసేలా చేస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

