పడతి అందానికి..పడమటి హంగు!
నిన్నటి ఫ్యాషన్ ఇవాళ పాతబడిపోవచ్చు... కానీ మన సొంత ైస్టెల్ ఎప్పటికీ శాశ్వతం. మారుతున్న కాలంతో పాటు ఈ సీజన్లో నలుగురిలోనూ స్పెషల్‌గా మెరిసిపోవాలంటే, ఇప్పుడొస్తున్న సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ‘ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్' హవా నడుస్తున్నది. భారతీయ సంప్రదాయం, పాశ్చాత్య ఆధునికతల అందమైన కలయికే ఇది.
నిన్నటి ఫ్యాషన్ ఇవాళ పాతబడిపోవచ్చు… కానీ మన సొంత ైస్టెల్ ఎప్పటికీ శాశ్వతం. మారుతున్న కాలంతో పాటు ఈ సీజన్లో నలుగురిలోనూ స్పెషల్‌గా మెరిసిపోవాలంటే, ఇప్పుడొస్తున్న సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ‘ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్’ హవా నడుస్తున్నది. భారతీయ సంప్రదాయం, పాశ్చాత్య ఆధునికతల అందమైన కలయికే ఇది. బంధువుల వేడుకల నుంచి ఆఫీస్ మీటింగుల వరకు… ఎక్కడైనా సరే ట్రెండీగా, అదే సమయంలో డిగ్నిఫైడ్‌గా కనిపించాలనుకునే మహిళలకు ఈ శైలి ఒక అద్భుతమైన చాయిస్.
సంప్రదాయకమైన కలంకారీ లేదా ఇక్కత్ లాంగ్ స్కర్టుల పైకి ట్రెండీ క్రాప్ టాప్స్ ధరించడం, వెస్ట్రన్ జీన్స్‌పైకి ఎంబ్రాయిడరీ కుర్తీలు జత చేయడం ఈనాటి హాట్ ట్రెండ్. ఇంకా ఈ ఫ్యూజన్ లుక్‌లో రకరకాల ప్రయోగాలు చేయవచ్చు. ఉదాహరణకు, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న హెవీ లాంగ్ స్కర్ట్ లేదా లెహంగాపైకి సింపుల్ షర్ట్ లేదా క్రాప్ టాప్ జోడించవచ్చు. అలాగే, జీన్స్ లేదా లెగ్గింగ్స్పైకి కాకుండా.. ట్రెండీ పలాజోలు, సిగరెట్ ప్యాంట్ల పైకి షార్ట్ కుర్తీలను జత చేయడం ద్వారా ఎంతో ైస్టెలిష్ లుక్ వస్తుంది.
సంప్రదాయ చీర కట్టుకు మోడరన్ టచ్ ఇస్తూ.. బ్లౌజ్‌కి బదులు క్రాప్ టాప్‌లు, బ్లేజర్లు వాడటం, నడుముకి వెస్ట్రన్ బెల్ట్ ధరించడం వంటివి సరికొత్త వైబ్‌ని ఇస్తాయి. చికన్‌కారీ, ఇక్కత్, కలంకారీ వంటి దేశీయ కళలను వెస్ట్రన్ కట్స్‌తో డిజైన్ చేసిన కో-ఆర్డ్ సెట్లకి ఇప్పుడెంతో గిరాకీ ఉంది. ఈ ైస్టెల్కి వెండి లేదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చేతితో చేసిన జుట్టీలు తోడైతే మీ లుక్ మరింత పర్ఫెక్ట్గా మారుతుంది. సౌకర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ఈ ఇండో-వెస్ట్రన్ ైస్టెల్‌ని మీరూ ట్రై చేసి, ఈ సీజన్ ట్రెండ్ సెట్టర్‌గా నిలవండి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

