సైనాలా మారాను!

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైనా’. సినిమాలో సైనా పాత్రలో ఒదిగిపోయేందుకు దాదాపు రెండేండ్లు కష్టపడింది పరిణీతి చోప్రా. ఈ ప్రయాణంలో సైనా గురించి, క్రీడాకారుల కష్టం గురించి తాను గమనించిన విషయాలను చెప్పుకొచ్చిందిలా..
సైనా పాత్రకు ఒప్పుకొన్నప్పుడు తను ఒక బ్యాడ్మింటన్ స్టార్ అని మాత్రమే తెలుసు. తన వ్యక్తిగత జీవితం తెలీదు. 2019లో మొదటిసారి సైనా కుటుంబాన్ని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. అప్పటినుంచి ఫిబ్రవరి 2020లో షూటింగ్ ముగిసేవరకూ తనను చాలా దగ్గరగా గమనించాను. సైనా విజయం వెనుక ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. రెండేండ్లపాటు వారిలో ఒకరిగా కలిసిపోయాను. సైనా అలవాట్లు, ఆలోచనలు, గెలుపోటములను స్వీకరించే పద్ధతి, హావభావాలు.. ప్రతీది పరిశీలించాను.
సమంగా స్వీకరిస్తా..
ఈ సినిమాకోసం నావల్ల చేయగలిగినంత చేశాను. సైనా ఒక క్రీడాకారిణి ఎంత కష్టపడుతుందో నేనూ అంతే కష్టపడ్డా. డైరెక్టర్ అమోల్ గుప్తా కూడా సైనా జీవితంపై చాలా పరిశోధించి కథ రాసుకున్నారు. అందుకే, అనుకున్న విధంగా రావాలని తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమా వరకూ అమోల్ సారే నాకు స్నేహితుడు, గైడ్, దర్శకుడు. సైనాకూడా షూటింగ్ జరిగినన్ని రోజులూ పక్కనే ఉండి ప్రతీది బాగా వచ్చేందుకు సహకరించింది. తన గురించి, తన ఇష్టాయిష్టాల గురించీ మాతో పంచుకుంది. షారుక్ ఖాన్‌ను ఎక్కువగా అభిమానించే సైనా ప్రేమకథ, పెండ్లి గురించి కూడా ఈ సినిమాలో వివరంగా ఉంటుంది.
ఆ రోజు కోసం ..
నేను చిన్నప్పటి నుంచీ ఆటలకంటే చదువుల మీదే శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ ఈ సినిమాకోసం పూర్తి అథ్లెట్‌గా మారాను. థానేలోని బ్యాడ్మింటన్ అకాడమీకి వెళ్ళి క్రీడాకారులను పరిశీలించాను. చివరిరోజు జంప్ స్మాష్ చేయబోయి గాయ
పడ్డాను కూడా. క్రీడాకారుల జీవితంలో గాయాలు కూడా ఒక భాగమే. ఆట పరంగా ఎంత ఒత్తిడి ఉన్నా సైనా చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ పూర్తయినా, లాక్డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. సినిమా పూర్తయిన తర్వాత నేను చూడలేదు. సైనాతో కలిసి చూసే అవకాశం కోసం నేను ఆశగా ఎదురుచూస్తున్నా.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- biopic
- pariniti chopra
- Saina
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

