అమ్మ ఆఫీస్‌కు వెళ్లినా..
ప్రసూతి సెలవులు ముగిసి తిరిగి ఉద్యోగంలో చేరడం అనేది ప్రతి తల్లి జీవితంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే, ఈ సమయంలో చాలామంది తల్లులకు ‘నేను ఉద్యోగానికి వెళ్తూ కూడా బిడ్డకు నా పాలు అందించగలనా?’అనే అనుమానం కలగడం సహజం. సరైన ప్రణాళిక, కుటుంబసభ్యుల మద్దతు, ఆఫీసు యాజమాన్యం సహకారంతో వరింగ్ మదర్స్ తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే బిడ్డకు నిరంతరాయంగా పాలు అందించవచ్చు.
ప్రసూతి సెలవులు ముగిసి తిరిగి ఉద్యోగంలో చేరడం అనేది ప్రతి తల్లి జీవితంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే, ఈ సమయంలో చాలామంది తల్లులకు ‘నేను ఉద్యోగానికి వెళ్తూ కూడా బిడ్డకు నా పాలు అందించగలనా?’అనే అనుమానం కలగడం సహజం. సరైన ప్రణాళిక, కుటుంబసభ్యుల మద్దతు, ఆఫీసు యాజమాన్యం సహకారంతో వరింగ్ మదర్స్ తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే బిడ్డకు నిరంతరాయంగా పాలు అందించవచ్చు.
బిడ్డ పుట్టిన మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సలహా ఇస్తారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎకువ కాలం ఇతర ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వొచ్చు. తల్లిపాలు బిడ్డకు పూర్తి పోషకాల్ని అందించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడుతూ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా డెలివరీ తర్వాత తల్లి శరీరం త్వరగా కోలుకోవడానికి ఇవి సాయపడటంతోపాటు భవిష్యత్తులో తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందుకోసం ఆఫీస్‌లో చేరడానికి కొన్ని వారాల ముందే బ్రెస్ట్ పంప్ ఉపయోగించడం అలవాటు చేసుకోవడం మంచిది.
దీనివల్ల పాలను పంపింగ్ చేయడం తల్లికి అలవాటవుతుంది. పంపింగ్ చేసిన పాలను బాటిల్ ద్వారా పిల్లలకు పట్టొచ్చు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేముందు బిడ్డకు నేరుగా పాలు ఇవ్వడం. ఆఫీస్ సమయంలో ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి పాలను పంప్ చేసి తీసి ఉంచడం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ బిడ్డకు పాలు ఇవ్వడం వంటి పద్ధతులు పాటించడం వల్ల పాల ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవచ్చు. పాలను పరిశుభ్రమైన, క్రిమిరహితం చేసిన బాటిల్స్ లేదా కంటైనర్లలో సేకరించాలి. కంటైనర్‌పై పాలు తీసిన తేదీ, సమయం తప్పకుండా రాయాలి. ఈ పాలను ఫ్రిజ్‌లో లేదా ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. ఇలా నిల్వ చేసిన పాలను అవసరమైనప్పుడు బయటికి తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత పిల్లలకు పట్టించాలి. అదే సమయంలో ఆఫీస్‌లో తల్లులు పాలు పంప్ చేయడానికి పరిశుభ్రమైన గది కేటాయించడంతోపాటు దానికి సరిపడా బ్రేక్స్ ఇవ్వడం వరింగ్ మదర్స్‌కి ఎంతో సాయపడుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

