రక్తానికి రక్షణ చక్రం
మన శరీరంలో కీలక అవయవాలైన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆయాచోట్ల పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపాలి. ఇందుకు మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మరి, శరీరంలో కణకణానికీ పోషకాలు
మన శరీరంలో కీలక అవయవాలైన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆయాచోట్ల పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపాలి. ఇందుకు మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మరి, శరీరంలో కణకణానికీ పోషకాలు, ఆక్సిజన్, హార్మోన్లు, కొవ్వులు మొదలైన వాటిని సరఫరా చేసే రక్తం సంగతి ఏమిటి?
మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ను, మనం తిన్న ఆహారంలోని పోషకాలను కణకణానికీ చేరుస్తుంది రక్తం. ఈ క్రమంలో కణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి. వాటిని తక్షణం బయటికి పంపాల్సి ఉంటుంది. అంతేకాదు.. రక్తం అనేది శరీరంలో నీటి మోతాదు, పీహెచ్ స్థాయులు, ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలే కాకుండా, తెల్ల రక్తకణాలు, లింఫోసైట్లు, న్యూట్రోఫిల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తి విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో చేరిపోయే హానికర బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాటానికి తమవంతు సాయం అందిస్తాయి. రక్తంలోని ప్లేట్లెట్స్ రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. ఇంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రక్తం గురించి మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రయత్నంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహకరిస్తాయి. దాంతోపాటే జీవనశైలి మార్పులూ అవసరమే.
వ్యాయామం: నిత్య వ్యాయామంతో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది. శరీరం పోషకాలను బాగా శోషణ చేసుకుంటుంది.
కాలేయ పరిశుభ్రత: పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే, కాలేయం శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సమర్థంగా వెలుపలికి పంపగలదు. రక్తాన్నీ శుద్ధి చేయగలదు. కాలేయం రక్తం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. అవన్నీ శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. మద్యపానాన్ని వదిలించుకోవడం, కాయగూరలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కాలేయాన్ని కాపాడుకోగలం. ఆహరంలోని పీచు పదార్థం కాలేయానికి కొత్త శక్తినిస్తుంది.
వ్యర్థాలను తొలగించే సామర్థ్యాన్నీ మెరుగుపరుస్తుంది.
నీళ్లు: మన శరీరంలో డబ్భు శాతం నీళ్లే ఉంటాయి. ఇందుకు రక్తమూ మినహాయింపు కాదు. డీహైడ్రేషన్ వల్ల రక్తంపై ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి, తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. నీళ్లు సహజమైన శుద్ధి కారకంగా పనిచేస్తాయి. శరీరం నుంచి, రక్తం నుంచి టాక్సిన్లను బయటికి పంపిస్తాయి. అలా రక్తాన్ని వడపోసి, దాని పనితీరు సవ్యంగా ఉండేలా చేస్తాయి.
బీట్రూట్: బీట్రూట్లో ఐరన్ సమృద్ధంగా ఉంటుంది. గ్లూటాథియోన్‌ను శరీరం సహజంగా ఉత్పత్తి చేసుకునేందుకు బీట్రూట్ దోహదపడుతుంది. కాలేయంలో మరమ్మతులకు, ఒంట్లో రక్తశుద్ధికి బీట్రూట్ సహకరిస్తుంది. ఇది నైట్రేట్లకు మంచి వనరు. ఈ కారణంగా రక్త నాళాల మందం పెరుగుతుంది (వాసోడైలేషన్). దీంతో రక్త శుద్ధి ప్రక్రియ మెరుగుపడటమే కాకుండా, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
వెల్లుల్లి: ఇందులో అల్లిసిన్ అనే సల్ఫర్ సమ్మేళనం ముడిగా దొరుకుతుంది. అంతేకాదు, వెల్లుల్లి కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. శరీరాన్ని ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్ గుణాలు రక్త శుద్ధికి సాయపడతాయి.
గ్రీన్ టీ: యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధం. దీనివల్ల ఆక్సిజన్ సరఫరాలో తలెత్తే హెచ్చు తగ్గుల ఫలితంగా ఏర్పడే.. ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ తగ్గుతుంది. గ్రీన్‌టీతో శరీరం, రక్తం.. రెండూ శుద్ధి అవుతాయి. రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే మంచి దంటారు.
మందారం (హైబిస్కస్) టీ: మందారం ఐరన్‌కు మంచి వనరు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఉంటాయి. వీటివల్ల రక్త శుద్ధి అవుతుంది. కొంతమేర రక్తపోటు నియంత్రణలోనూ ఉంటుంది. రోజుకు ఒక కప్పు మందారం టీ లేదా మందారం జ్యూస్ తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

