Health Tips for Children’s | చలికాలంలో మీ పిల్లలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే !
చిన్నపిల్లల ఊపిరితిత్తులు కాస్త బలహీనంగా ఉంటాయి. శ్వాస పీల్చుకునే మార్గం కొంచెం సన్నగా ఉంటుంది. ఫలితం! త్వరగా జలుబు చేయడం, కఫం పేరుకుపోవడం, న్యుమోనియాలాంటి సమస్యలకు దారితీయడం జరుగుతుంది. అందుకే శీతకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే! అందుకోసం...
Health Tips for Children’s | చిన్నపిల్లల ఊపిరితిత్తులు కాస్త బలహీనంగా ఉంటాయి. శ్వాస పీల్చుకునే మార్గం కొంచెం సన్నగా ఉంటుంది. ఫలితం! త్వరగా జలుబు చేయడం, కఫం పేరుకుపోవడం, న్యుమోనియాలాంటి సమస్యలకు దారితీయడం జరుగుతుంది. అందుకే శీతకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే! అందుకోసం…
వెచ్చని దుస్తులు: చలికాలం పిల్లల ఒంటి నిండా దుస్తులు ఉండేలా చూడాలి. దానివల్ల బయట చలి నుంచే కాదు… ఒంట్లోని వేడి కూడా కరిగిపోకుండా కాపాడినవాళ్లం అవుతాం. వీలైతే ఉన్ని దుస్తులూ వాడవచ్చు. చేతులకు, కాళ్లకు కూడా గ్లవ్స్, సాక్స్ తొడిగినా మంచిదే!
మసాజ్: గోరువెచ్చని నువ్వులనూనె, కొబ్బరినూనె లాంటివాటితో పిల్లల ఒంటిని మసాజ్ చేయడం వల్ల వారి శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒళ్లు వెచ్చగా ఉండేందుకు, బాగా నిద్రపట్టేందుకు సాయపడుతుంది.
పోషకాహారం: తల్లిపాలలో పిల్లలకు కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. వీటితోపాటు వయసును బట్టి తాజా పండ్ల్లు, కాయగూరలు అందిస్తుంటే రోగ నిరోధకశక్తి పెరిగి జలుబు, దగ్గు లాంటి సమస్యలను తేలికగా ఎదుర్కోగలరు.
ముందుజాగ్రత్త: పిల్లల్లో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, ఎగశ్వాస, నిద్రపట్టకపోవడం, ఒళ్లు వెచ్చబడటం లాంటి లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. రూమ్ హీటర్స్ వాడటం, చలిగాలుల్లో తిప్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చర్యలతో శీతకాలంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- cold
- Health news
- health tips
- Ill
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

