భేష్.. బీ ఫ్రెష్!
తేనెటీగలు కొంచెంకొంచెంగా మకరందాన్ని పోగేసినట్టు.. కొద్దికొద్దిగా పెట్టుబడి పెడుతూ, క్రమక్రమంగా తేనె వ్యాపారాన్ని దేశమంతా విస్తరిస్తున్నారు జోకూడి అనూష. రాణి ఈగలా బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తూ ‘బీ ఫ్రెష్’ను లాభాలవైపు తీసుకెళ్తున్నారామె.

జోకూడి అనూష.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివారు. ఇన్ఫోసిస్ అమెరికా శాఖలో ఉద్యోగం చేశారు. డాలర్లలో జీతం, విలాసవంతమైన జీవితం. అయినా ఏదో లోటుగా అనిపించేది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆ యువతికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. అంతలోనే, మానవాళి మీద కొవిడ్ దాడి మొదలైంది. భర్త సుమన్‌తో కలిసి హైదరాబాద్ వచ్చేశారు. ఖాళీగా ఉండకుండా, ఏదైనా వ్యవసాయ సంబంధ వ్యాపారం చేయాలని భావించారు. ఓసారి, స్వచ్ఛమైన తేనె కోసం మార్కెట్ మొత్తం తిరిగారు. ఎటు చూసినా నకిలీ సరుకే. ఆ చేదు అనుభవం తర్వాత, తేనెటీగల పెంపకంవైపు అడుగులు వేశారు. రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్డీలో పది రోజులపాటు శిక్షణ కూడా తీసుకొన్నారు. ‘బీ ఫ్రెష్’ బ్రాండ్ పేరుతో తేనె ఉత్పత్తిని ప్రారంభించారు. ఏడాది పూర్తికాకముందే.. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ నగరాలకు స్వచ్ఛమైన తేనెను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు అనూష.
తొలి అడుగు తేనె వ్యాపారాన్ని చిన్న స్థాయిలోనే ప్రారంభించారు అనూష. యాభైవేల పెట్టుబడితో, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడలో ఐదు బాక్సులతో తేనెటీగల పెంపకం మొదలుపెట్టారు. ఏడాది తిరిగే సరికి.. ఇరవై లక్షలు వెచ్చించి రెండువందల యాభై బాక్సులకు విస్తరించారు. వికారాబాద్ ప్రాంతంలో వామ పంట సీజన్లో, నిజామాబాద్‌లో పొద్దుతిరుగుడు సీజన్లో, ఆర్మూర్‌లో నువ్వుల పంట సమయంలో తేనెటీగల బాక్సులను ఏర్పాటు చేసి.. అక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. ఆ తేనెను ఎల్బీ నగర్‌లోని ప్యాకింగ్ పాయింట్‌కు తరలించి ‘బీ ఫ్రెష్’ బ్రాండ్ పేరిట సిద్ధం చేస్తారు. వివిధ దశల్లో నాణ్యతా పరీక్షలూ ఉంటాయి. ఎక్కడా రాజీపడరు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలకు సరఫరా చేస్తున్నారు. కొండలు, గుట్టలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అయితే, తేనెటీగల పెంపకానికి అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో యాచారం మండల కేంద్రాన్ని ఎంచుకొన్నట్టు చెబుతారు అనూష.

శిక్షణ ఇస్తాం..
తొలుత చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ వెనుకడుగు వేయలేదు. కుటుంబం నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఎంతోమందికి ఉపాధి కల్పించాం. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తాం. అంతా కల్తీ అవుతున్న ఈరోజుల్లో ప్రజలకు స్వచ్ఛమైన తేనెను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
జోకూడి అనూష
యు.రాఘవేందర్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

