అరటాకు వైద్యం
అరటాకు భోజనం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి. వాపులు, గుండెజబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ తదితర వ్యాధులను నియంత్రించే శక్తి అరటాకులకు
అరటాకు భోజనం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి.
వాపులు, గుండెజబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ తదితర వ్యాధులను నియంత్రించే శక్తి అరటాకులకు ఉందని అధ్యయనాలు నిరూపించాయి.
- అరటాకులో రూటిన్ అనే వృక్ష సంబంధ వర్ణద్రవ్యం ఉంటుంది. మధుమేహాన్ని ఇది అదుపులో ఉంచుతుంది. అనేక వ్యాధుల్ని దరిచేరనీయదు.
- అరటాకులోని యాంటీ ఆక్సిడెంట్లకు జలుబును తగ్గించే శక్తి ఉంది. వీటిలోని ఫైటో కెమికల్స్ జ్వరాన్ని తగ్గించడంలోనూ సాయపడతాయి. కాబట్టే, తరచూ అరటాకు కషాయం తాగాలని పెద్దలు చెబుతారు.
- గాయాలకు అరటాకుతో కట్టిన కట్టు.. పెట్రోలియం జెల్లీతో కట్టే గాజు కట్టుతో సమానమని వెల్లడైంది.
ఆకులోని యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుండ్లను సహజంగా తగ్గిస్తాయి. - చర్మం మీద కనిపించే సెల్యులైటిస్ అనే ఒక రకం ఇన్ఫెక్షన్ను నియంత్రించడంతో అరటాకు పసరు
ఔషధంలా పనిచేస్తుంది. - తెల్లజుట్టు, చుండ్రు అరికట్టేందుకు అరటాకు రసం సాయపడుతుంది. తలంతా పట్టిస్తే.. దురద తగ్గి, కురులు నల్లగా నిగనిగలాడతాయి.
- అల్సర్లను నిరోధించడంలో అరటాకు సమర్థంగా పని చేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు, టానిన్లు, ఫినోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుండ్లను నివారిస్తాయని ఒక పరిశోధనలో తేలింది.
- అరటాకులో వేడి వంటకాలను వడ్డించినప్పుడు వచ్చే సువాసన ఆకలిని పెంచుతుందనీ అంటారు.
- కొన్ని ప్రాంతాల్లో పాము కరిచిన చోట అరటాకు ముద్ద పూస్తారు. ఇందులోని టానిల్స్, పాలీఫినాల్స్ విషపూరిత ప్రొటీన్లను పనిచేయకుండా చేస్తాయి.
- అరటాకులో వేడివేడి వంటలు చేరినప్పుడు, లేదా అరటాకులో చుట్టి వంటకాల్ని ఉడికించినప్పుడు ఎపిగాలోక్యాటచిన్ గాలేట్లుగా పిలిచే పాలీఫినాల్స్ ఆహారానికి తోడవుతాయి. ఇవి రోగ నిరోధకతను ప్రసాదిస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

