బరువు పెరగాలంటే ఓ డైట్. తగ్గడానికి ఇంకో డైట్. శరీరంలో కొవ్వు కరగడానికి, నాజూగ్గా తయారవ్వడానికీ డైట్! మానసిక ఆరోగ్యానికి మరో డైట్!.. ఇలా ప్రతి సందర్భానికీ ఓ ప్రత్యేకమైన ‘డైట్’ ఉంటుంది. మరి.. మహిళల జీవితంలో సర్వసాధారణమైన ‘పీరియడ్స్’ కోసం ఎలాంటి డైట్ లేదా? అంటే.. ఉన్నదనే చెబుతున్నారు వైద్య నిపుణులు. ‘నెలసరి’తోపాటే పలకరించే పలు ఆరోగ్య సమస్యలను కట్టడి చేయాలంటే.. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తీసుకోవాల్సిందేనని అంటున్నారు.
పీరియడ్స్ సమయంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం మాత్రమే కాదు.. నివారించాల్సిన పదార్థాలు కూడా ముఖ్యమే! కాబట్టి, అధిక ఉప్పు, జంక్ ఫుడ్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పక్కన పెట్టేయాలి. వీటివల్ల కడుపు ఉబ్బరం మరింత పెరుగుతుంది. ఇక కాఫీ, సోడా, ఆల్కహాల్ లాంటివి ఆందోళనను పెంచడంతోపాటు తిమ్మిర్లను తీవ్రం చేస్తాయి. అందుకే, వీటికి విరామం ఇవ్వాలి. ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీకి దారితీస్తాయి. కాబట్టి, ఆహారంలో కారం తగ్గించుకుంటే మంచిది.