రుచికి రుచి.. ఆదాకు ఆదా!
తొలకరి పలకరించినా.. భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించినా.. కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు హెచ్చడంతో.. మార్కెట్లో వంద కాగితానికి విలువ లేకుండా పోయింది.
తొలకరి పలకరించినా.. భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించినా.. కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు హెచ్చడంతో.. మార్కెట్లో వంద కాగితానికి విలువ లేకుండా పోయింది. ఈ క్రమంలో కాయగూరల ధరాఘాతం నుంచి తప్పించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అయిపోండి..
వానలు పడుతున్నా.. ఇంకా పచ్చడి మామిడికాయలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. సీజన్ ముగుస్తుండటంతో ధరలు కూడా అందేటట్టే ఉన్నాయి. ఓ పదికాయలు తెచ్చుకొని.. ముక్కలుగా కోసి, ఉప్పు, పసుపు దట్టించండి. ఆకాశంలో మబ్బుల ఛాయ లేనప్పుడే ఈ క్రతువుకు పూనుకోవాలండోయ్! అలా సిద్ధం చేసిన మామిడి ముక్కలను డాబా మీద ఆరబెట్టుకోవాలి. నాలుగైదు రోజులు ఎండనిస్తే.. మామిడి ముక్కలు ఏడాదంతా నిల్వ ఉండే వరుగులుగా రూపాంతరం చెందుతాయి. వానలు బాగా కురిసే శ్రావణంలోనూ.. మామిడికాయ పప్పు తినాలంటే.. ఈ వరుగులు వేసుకొని ఎంచక్కా పప్పు వండుకోవచ్చు. టమాటాలకూ ఈ సూత్రం వర్తిస్తుంది.
ఇప్పుడు కిలో రూ.80 పలుకుతున్న టమాటా ధర నాలుగు వానలు పడ్డాక నేలచూపులు చూడటం ఖాయం. దోర టమాటాలు ఓ పదికిలోలు తెచ్చుకొని నిల్వ పచ్చడి చేసుకుంటే.. నాలుగు నెలలపాటు పూటపూటకూ కారం కారంగా ఓ వాయ లాగించొచ్చు. వానకాలం మునగాకు అందుబాటులో ఉంటుంది. చెన్నంగాకు కూడా ఇప్పుడు దొరుకుతుంది. వీటిని ఆరబెట్టుకొని పొడి చేసుకుంటే.. పక్షం రోజుల వరకు బేషుగ్గా ఉంటాయి. గంజి అన్నంలోకి మునగాకు పొడి కలుపుకొని తింటే అద్భుతః అంటాం. వేడి వేడి అన్నానికి చెన్నంగాకు పొడి దట్టించి.. పైనుంచి చిక్కటి పాలు సంప్రోక్షణ చేసి తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకు.. ఆదా!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- dora tomatoes
- Health
- Rains
- tomatoes
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

